Begin typing your search above and press return to search.
కట్ చేస్తే.. ముందొచ్చినోడికే టైటిల్
By: Tupaki Desk | 26 July 2016 3:30 PM GMTఇప్పటివరకూ సినిమా టైటిల్ వ్యవహారం పెద్ద ప్రహసనం. తమ సినిమాకి టైటిల్ పెట్టుకోవడమే ఓ పెద్ద పని అయితే.. దాన్ని రిజిస్టర్ చేయించుకోవడం.. వేరేవాళ్లు రిజిస్టర్ చేసుంటే దక్కించుకోవడం మరో పెద్ద తలనొప్పి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకంటూ.. కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు.
కొత్త సిస్టం ఏంటంటే.. ముందు ఎవరు సెన్సార్ చేయించుకోవడానికి కాపీ తీసుకొస్తారో.. వాళ్లకే ఆ టైటిల్ దక్కుతుంది. ఈ విధానాన్ని సెన్సార్ బోర్డ్ ప్రతిపాదించింది. నిజానికి సినిమా టైటిల్స్ తో సెన్సార్ కి సంబంధం లేదు. టైటిల్స్ రిజిస్ట్రేషన్ ను 'ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' - ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' - 'ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్' - 'వెస్టర్న్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' లు చూసుకుంటున్నాయి. ఏదైనా గొడవ వచ్చినా వీళ్లే పరిష్కరిస్తారు.
ఈ విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న సీబీఎఫ్సీ.. టైటిల్స్ విషయంలో ముందు కాపీ పట్టుకొచ్చినేళ్లకే ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇప్పటివరకూ టైటిల్స్ రిజిస్టర్ చేసుకుని అమ్మేసుకోవడమే బిజినెస్ గా పెట్టుకున్నోళ్ల తలనొప్పులు తగ్గుతాయని నిర్మాతలు సంతోషిస్తున్నా.. ఓ ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఓ మూవీని భారీ బడ్జెట్ తో తీసేందుకు ఏళ్లకేళ్లు పడుతుంది. ఆ సినిమాని టైటిల్ తో సహా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా సరే ఓ సినిమాని నెల్లాళ్లకే పూర్తి చేసేసి తమకు ఆ టైటిల్ కావాలంటే ఇచ్చేయాల్సిందే.
అప్పుడు ప్రతిష్టాత్మకంగా సుదీర్ఘంగా తీసే సినిమాలకు దెబ్బ పడిపోతుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే మళ్లీ చాలామందిని మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న ఈ విధానానికి వత్తాసు పలికేదెందరో.