Begin typing your search above and press return to search.

హీరోయిన్ బోల్డ్ గా ఓకే.. హీరోలకే కత్తెర

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:57 AM GMT
హీరోయిన్ బోల్డ్ గా ఓకే.. హీరోలకే కత్తెర
X
పీరియాడికల్ కాన్సెప్ట్ తో వస్తున్న బాలీవుడ్ మూవీ రంగూన్. స్వతంత్రం రాకముందుకు సంబంధించిన ఓ స్టోరీని తీసుకుని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి హీరోయిన్ కంగనా రనౌత్ హాట్ టాపిక్ అయిపోయింది.

అటు సైఫ్ ఆలీఖాన్ తోను.. ఇటు షాహిద్ కపూర్ తోను రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ చేసేసింది. ఇంటిమేట్ సీన్లను కూడా తెగ పండించేసింది. ఏకంగా టాప్ లెస్ లో నటించినట్లుగా కూడా ట్రైలర్ లో చూపించడం చూసి.. అసలీ సీన్స్ ని సెన్సార్ వారు సినిమాలో ఉంచుతారా అని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కంగనా చేసిన బోల్డ్ సీన్స్ కు.. యాక్టింగ్ కు సెన్సార్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఎదురుకాలేదట. కానీ సైఫ్.. షాహిద్ లు కనిపించిన కొన్ని సన్నివేశాలకు కత్తెర పడాల్సిందే అని తేల్చేశారట.

హీరోయిన్ స్కిన్ షో వదిలేసి.. హీరోలపై సెన్సార్ వాళ్లు దృష్టి పెట్టడానికి రీజన్.. వాళ్లు లిక్కర్ తాగడం.. సిగార్స్ వాడకం సంబంధించిన సీన్స్ ఉండడమే అని తెలుస్తోంది. ఈ సన్నివేశాల్లో హెచ్చరిక మార్క్ వేయడం కానీ.. ఆయా సీన్స్ ను తొలగించడం కానీ చేయకపోతే.. సర్టిఫికేట్ ఇచ్చే సమస్యే లేదని తేల్చేసిందట సెన్సార్ బోర్డ్. ఇండియన్ సెన్సార్ విచిత్రాల్లో ఇదొకటిగా చెప్పుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/