Begin typing your search above and press return to search.
ఆర్జీవీ దెబ్బకు సెన్సార్ కే ముచ్చెమటలు
By: Tupaki Desk | 11 March 2019 2:04 PM GMTఎన్టీఆర్ జీవితకథలో వాస్తవాన్ని చూపిస్తున్నాను అంటూ ఆర్జీవీ చేస్తున్న హంగామా గురించి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను చెప్పేందుకు `లక్ష్మీస్ ఎన్టీఆర్` తీస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా గురించే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోసారి ఆర్జీవీ మార్క్ సంచలనాలకు తెర తీశారు. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్.. టీజర్.. ట్రైలర్ ప్రతిదీ సంచలనమే. ఇటీవలే రిలీజైన రెండు ట్రైలర్లు యూట్యూబ్ లో దూసుకుపోయాయి. కోట్లాది మంది కేవలం కొద్ది రోజుల్లోనే వీక్షించారు. ట్రైలర్ అంత సక్సెసైంది కాబట్టి సినిమా ఇంకెంత పెద్ద సక్సెసవుతుందోనన్న చర్చా ఆర్జీవీ అభిమానుల్లో సాగుతోంది.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన అనంతరం నందమూరి కుటుంబంలో చెలరేగిన కలతలపై తెరపై చూపిస్తున్నారు ఆర్జీవీ. లక్ష్మీ పార్వతి విషయంలో నందమూరి కుటుంబీకులు ఎలా స్పందించారు? ఎన్టీఆర్ క్షోభ ఏమిటి.. అన్నది తెరపై చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమాని నందమూరి కుటుంబం కోర్టుకీడుస్తుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకూ అలాంటి సిగ్నల్స్ ఏవీ కనిపించలేదు. ఈ నెల 22న సినిమా రిలీజ్ కానుంది. తాజా అప్ డేట్ ప్రకారం. ఈ సినిమా సెన్సార్ గడప పైకి వెళ్లిందని సమాచారం.
అయితే ఆర్జీవీ దెబ్బకు సెన్సార్ వాళ్లు సైతం కన్ఫ్యూజన్ లో ఉన్నారట. అసలే ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వాలా.. వద్దా? అన్న డైలెమాలో ఉన్నారట. అందుకు సంబంధించి ముందుగా ఎన్నికల కమీషన్ ని సంప్రదించేందుకు ప్రాంతీయ సెన్సార్ బృందం రెడీ అవుతోంది. 122 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేయడం ఎన్నికల వేళ ప్రహసనమేనని భావిస్తున్నారట. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం.. ఎన్టీఆర్ పై తీసిన ఈ సినిమా రిలీజవుతుందా.. లేదా? అన్నది ఇంకా సస్పెన్స్ అని తెలుస్తోంది.