Begin typing your search above and press return to search.
ఆ ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్పండి
By: Tupaki Desk | 22 Feb 2017 5:20 AM GMTరామ్ గోపాల్ వర్మ ఎంతో కాలం తరువాత బాలీవుడ్ వెళ్ళి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని రూపొందిస్తున్న సినిమా ఈ సర్కార్ 3. గతంలో మనోడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో సర్కార్ అండ్ సర్కార్ 2 రూపొందించి భారీ హిట్లే కొట్టాడు. ముంబయ్ లీడర్.. శివసేన అధినేత.. బాలాసాహెబ్ థాక్రే జీవిత చరిత్రను బేస్ చేసుకుని.. అమితాబ్ ను సుభాష్ నాగ్రే అనే పాత్రలో వెండితెర బాల్ థాక్రేగా పేరు పెట్టకుండానే ఆవిష్కరించాడు వర్మ. అయితే ఇన్నాళ్ళూ ఆయన అలాంటి ఫీట్లు ఎన్నిచేసినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళూ థాక్రే సాబ్ బ్రతికే ఉన్నారు. కాని 2012లో ఆయన మరణించాక ఆయన ఫ్యామిలీలో చాలా చీలీకలు వచ్చేశాయి. అందుకే ఇప్పుడు సర్కార్ 3 సినిమా అంటే మహారాష్ట్ర సర్కార్ కూడా బేంబేలెత్తిపోతోంది.
నిజానికి సర్కార్ అండ్ సర్కార్ 2 విడుదలైనప్పుడు.. కేవలం సినిమాకు ముందు మాత్రం ఈ సినిమా నిజజీవితపు పాత్రలకు ఎవ్వరికీ సంబంధం లేదు అంటూ డిస్ క్లయిమర్ ఒకటి వేయమన్నారు. అలాంటి విజ్ఞాపన ఇప్పుడు ట్రైలర్లకు కూడా వేయమంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సెన్సార్ బోర్డ్ వర్మ తీస్తున్న సర్కార్ 3 ట్రైలర్లకు ముందు కూడా.. ఈ సినిమా కథ కాని ఇందులో పాత్రలు కాని.. అన్నీ కల్పితాలే.. నిజజీవితంలో ఎవ్వరికీ సంబంధం లేదు అంటూ ఒక లైన్ వేయాలని సూచించింది. ప్రతీ ట్రైలర్ ను వారు ఒకటికి రెండుసార్లు చెక్ చేశాక ప్రసారం చేయడానికి అనుమతి ఇస్తారట. థాక్రే ఫ్యామిలీకి సంబంధం లేదు అనే స్టేట్మెంట్లు ఇన్ డైరెక్టుగా ఇస్తేనే ఈ ట్రైలర్లు బయటకు వస్తాయనమాట.
ఇకపోతే వర్మ అసలే ముదురు. మనోడు ఎటవంటి సెన్సార్ కటింగులు లేని ట్రైలర్లను యుట్యూబ్ లో రిలీజ్ చేసినా చేసేస్తాడు. ఎందుకంటే యుట్యూబ్ లో రిలీజ్ చేయడానికి సెన్సార్ సర్టిఫికేట్ తో పనిలేదుగా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/