Begin typing your search above and press return to search.

పటాస్‌పై అలాంటి ముద్ర వేసేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   20 Jan 2015 7:09 AM GMT
పటాస్‌పై అలాంటి ముద్ర వేసేస్తే ఎలా?
X
‘ఐ’ మూవీకి ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వాళ్లు. ఈ విషయంలో శంకర్ అండ్ కో చాలా పట్టుబట్టారని.. అతి కష్టం మీద యు సర్టిఫికెట్ తెచ్చుకున్నారని వినికిడి. ఐతే ఈ సినిమాలో అమీ జాక్సన్ అందాల ప్రదర్శన.. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు చూసి.. ‘ఎ’ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ సంగతలా ఉంచితే.. వచ్చే వారం విడుదల కాబోయే ‘పటాస్’కు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం కళ్యాణ్ రామ్‌కు షాకే అని చెప్పాలి. ట్రైలర్ చూస్తే ఇందులో అడల్టు కంటెంటేమీ ఉన్నట్లేమీ కనిపించట్లేదు.
ఇంతకుముందు ఇదే స్టయిల్లో వచ్చిన గబ్బర్ సింగ్, దూకుడు, ఆగడు లాంటి సినిమాలకు యు/ఎ సర్టిఫికెట్లే ఇచ్చారు. మరి వాటికి, పటాస్‌కు తేడా ఏమిటో మరి. సెన్సార్ సర్టిఫికెట్ల విషయంలో సినిమా సినిమాకు అభిప్రాయం మారిపోతుంటుందనడానికి గతంలో చాలా రుజువులే ఉన్నాయి. కొన్ని సినిమాల విషయంలో మరీ కఠినంగా ఉండటం.. ఇంకొన్ని సినిమాల్ని లైట్ తీస్కోవడం మామూలే. ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తే ఏమైందిలే అనుకోవడానికి లేదు. ఈ మధ్య మల్టీప్లెక్సుల్లో చాలా స్ట్రిక్టుగా ఉంటున్నారు. ‘ఎ’ రేటెడ్ మూవీలకు పిల్లల్ని అనుమతించడం లేదు. ఈ విషయంలో ‘పటాస్’కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే.