Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ బూతుకు క‌ళ్లెం!!

By:  Tupaki Desk   |   8 Oct 2018 6:39 AM GMT
వెబ్ సిరీస్ బూతుకు క‌ళ్లెం!!
X
వేడి పెంచ‌డం.. సెగ‌లు రాజేయ‌డం.. రోమాంచిత కంటెంట్‌ తో ఒంట్లోంచి సెగ‌లు - పొగ‌లు ర‌ప్పించ‌డం.. ఇదీ పాశ్చాత్య వెబ్ సిరీస్‌ ల శైలి. ఇదే తీరుగా అగ్గిమీద గుగ్గిలం ఫార్ములాతో వేడెక్కించేందుకు లోక‌ల్‌ గానూ స‌న్నాహాలు సాగుతున్నాయి. ఆల్మోస్ట్ మ‌హేష్‌ భ‌ట్ ఫార్ములాని - ఏక్తా క‌పూర్ ఫార్ములాని ఫాలో చేస్తూ ప్ర‌స్తుతం ఇండియాలోనూ వెబ్ సిరీస్‌ లు చెల‌రేగిపోతున్న తీరు ప్ర‌స్తుతం సీబీఎఫ్‌ సీలో చ‌ర్చ‌కొచ్చింది. యువ‌త‌రం చెడిపోయేందుకు - విశృంఖ‌ల‌త్వానికి అల‌వాటు ప‌డే ఆస్కారం ఉన్నందున ఈ బూతు వెబ్ సిరీస్‌ ల‌కు క‌ళ్లెం వేసేందుకు క‌ఠిన నియ‌మ‌నిబంధ‌నల్ని రూపొందించేందుకు సీబీఎఫ్‌సీ ప్ర‌య‌త్నిస్తోంది.

అర‌చేతి-మొబైల్‌ లో ప్ర‌పంచం ఇమిడిపోయిన ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రి క‌న్ను వెబ్ సిరీస్‌ ల‌పైనే ప‌డింది. ఆ క్ర‌మంలోనే భ‌విష్య‌త్ వెబ్ స‌రీస్‌ లదేన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. దీంతో టాలీవుడ్‌ కి ఈ వైర‌స్ బ‌లంగానే సోకింద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ - రాజ‌మౌళి - దేవ‌క‌ట్టా - నాగ‌బాబు - జ‌గ‌ప‌తిబాబు - రాజ్‌ కందుకూరి (నిర్మాత‌) వంటి స్టార్ డ‌మ్ ఉన్న‌వాళ్లే ఈ వెబ్ సిరీస్‌ ల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారంటే .. ఆ వెన‌క ఎంత బిజినెస్ సాగ‌నుందో అర్థం చేసుకోవాలి. మొన్న‌టికి మొన్న యంగ్ య‌మ‌ ఎన్టీఆర్ సైతం వెబ్ సిరీస్‌ లో ఛాన్సొస్తే న‌టించేస్తాన‌ని మాటిచ్చారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ నిర్మాత‌లు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్ - అమెజాన్‌ తోనూ ఒప్పందాలు ఖరారు చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. దీని వెన‌క‌ వంద‌ల కోట్ల బిజినెస్ సాగే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక్కో వెబ్ సిరీస్‌ కి రూ.7కోట్లు -రూ.10కోట్లు పెట్టేందుకు ప్రాంతీయ స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. వెబ్ సిరీస్ అంటే యూనివ‌ర్శ‌ల్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్ష‌ణ ఉంటుంది.

స‌రిగ్గా ఇదే పాయింట్.. కొత్త అవ‌కాశాలు.. దారుల‌కు తెర‌తీస్తోంది. అయితే దీంతోపాటే విచ్చ‌ల‌విడిత‌నం పెట్రేగిపోయే స‌న్నివేశం క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇండియాని పూర్తిగా బూతు ఫారిన్‌ గా మార్చేసేవి వెబ్ సిరీస్‌లు అని అప్పుడే తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. దీనిపై టీవీ చానెళ్లు - ప‌త్రిక‌ల్లో ఆస‌క్తిక‌ర‌ డిబేట్ మొద‌లైంది. మ‌రీ బెడ్ రూమ్ .. బాత్‌రూమ్ పోర్న్ య‌థేచ్చ‌గా.. మొబైల్స్‌లోకి వ‌చ్చేస్తే ఆ ప్ర‌మాదం అంతా ఇంతా కాదు. యూత్ స‌ర్వ‌నాశ‌నం అవ్వ‌డం ఖాయ‌మ‌ని భావించి సెన్సార్ క‌ట్ చెప్పేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. కొన్ని వెబ్ సిరీస్‌లు మ‌రీ దారుణం.. వీటికి క‌ళ్లెం వేసేందుకు సీబీఎఫ్‌ సీ స‌న్నాహాలు చేస్తోందిట‌. సినిమాల‌కు చేసిన‌ట్టే వెబ్ సిరీస్‌ ల‌కు సెన్సార్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. దీనిపై సెన్సార్ అధికారిణి ఒక‌రు - నిర్మాత రాజ్‌ కందుకూరి వంటి వారు త‌మ అభిప్రాయాల్ని తెలిపారు. విశృంఖ‌ల‌త్వాన్ని ఆపాల్సి ఉంటుంద‌ని త‌మ వ్యూని ఓ చానెల్ డిబేట్‌ లో వ్య‌క్త‌ప‌రిచారు.