Begin typing your search above and press return to search.
సెన్సార్ పూర్తయినా కోర్టు కరుణించదా?
By: Tupaki Desk | 26 Sep 2019 11:18 AM GMTదేవుడు వరమిచ్చినా పూజారి కరుణించక మొకాలడ్డేసినట్టుగా తయారైంది `సైరా` పరిస్థితి. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరపైకొచ్చిన `సైరా నరసింహారెడ్డి` రిలీజ్ దగ్గర పడుతున్నాకొద్దీ మేకర్స్‌కి ముచ్చమటలు పట్టిస్తోంది. వరుస వివాదాలతో హడతెల్లించేస్తోంది. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ సరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రామ్ చరణ్ తన తండ్రి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. రిలీజ్ కు మరో ఆరు రోజులున్న ఈ సినిమాపై ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ఓ కేసు విచారణంలో వుంది.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయినా కోర్టు కరుణించేలా కనిపించడం లేదు. ఈ సినిమా `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` బయోపిక్ కాదని - చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టుకు వెల్లడించడం కొత్త వివాదానికి తెర తీసేలా కనిపిస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదం హైకోర్టులో వున్న కారణంగా సెన్సార్ అధికారులు `సైరా` సెన్సార్ సర్టిఫికెట్ ని చిత్ర బృందానికి ఇవ్వడానికి సోమవారం వరకు వాయిదా కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉయ్యాలవాడ వారసులు `సైరా` చిత్ర బృందం తమని మోసం చేశారని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయడంతో తీర్పు ఎలా వుంటుందోనని `సైరా` బృందం ఆందోళన పడుతున్నారట.