Begin typing your search above and press return to search.

సెన్సార్ చిక్కులతో బుర్ర‌క‌థ వాయిదా?

By:  Tupaki Desk   |   27 Jun 2019 4:36 AM GMT
సెన్సార్ చిక్కులతో బుర్ర‌క‌థ వాయిదా?
X
సెన్సార్ అభ్యంత‌రాల‌తో ఇదివ‌ర‌కూ ప‌లు చిత్రాలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. సెన్సార్ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మిస్తే ఇటీవ‌ల రిలీజ్ లు కష్ట‌మ‌వుతోంది. ఈ శుక్ర‌వారం టాలీవుడ్ లో రిలీజ‌వుతున్న సినిమాల‌కు సెన్సార్ చిక్కులు ఎదుర‌య్యాయ‌ని తెలుస్తోంది. సెన్సార్ అధికారి రాజీ లేని త‌త్వం వ‌ల్ల రిలీజ్ లు స‌స్పెన్స్ లో ప‌డాల్సి వ‌స్తోంద‌ట‌. ముఖ్యంగా ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడిగా డైమండ్ ర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బుర్ర‌క‌థ సెన్సార్ చిక్కుల‌తో వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ వాస్త‌వంగా ఈ శుక్ర‌వారం (28న‌) ఉంటుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కానీ సెన్సార్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా వేస్తున్నామ‌ని.. త్వ‌ర‌లో కొత్త తేదీని చెబుతామ‌ని బుర్ర‌క‌థ టీమ్ ప్ర‌క‌టించింది. ఒక‌రోజు ఆల‌స్యంగా అంటే ఈనెల 29న రిలీజ్ కి ఆస్కారం ఉంద‌న్న మాట వినిపిస్తున్నా.. చిత్ర‌యూనిట్ అధికారికంగా తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఈ శుక్ర‌వారం మొత్తం మూడు రిలీజ్ ల‌కు తేదీల్ని ప్ర‌క‌టించారు. బుర్ర‌క‌థ‌తో పాటు శ్రీ‌విష్ణు- బ్రోచేవారెవ‌రురా.. రాజ‌శేఖ‌ర్‌- క‌ల్కి చిత్రాలు కూడా రిలీజ‌వుతున్నాయి. వీటి విష‌యంలోనూ సెన్సార్ అధికారి ఎంతో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. కేంద్రం నుంచి వ‌చ్చిన సిఫార్సు మేర‌కు వీటిలో ఓ సినిమా రిలీజ్ కి అడ్డంకి రాలేద‌న్న మాటా వినిపిస్తోంది. మొత్తానికి ఈ వారం రెండు సినిమాల‌కు లైన్ క్లియ‌రైంది. మూడో సినిమా బుర్ర‌క‌థ ఎప్పుడొస్తుందో తేలాల్సి ఉంది. అయితే ఆది సాయికుమార్ టీమ్ రిలీజ్‌ వాయిదాకు అస‌లు కార‌ణ‌మేంటి? సెన్సార్ గ‌డ‌ప‌పై ఏం జ‌రిగింది? అన్న‌ది వెల్ల‌డించాల్సి ఉంది.

బుర్ర‌క‌థ సెన్సార్ పూర్త‌వుతుందా.. లేదా? అన్న‌ది నేటి (గురువారం) సాయంత్రానికి తేల‌నుందని సినీ మీడియాలోనూ టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ ఈ వారం రిలీజ్ లేదు అనుకుంటే వ‌చ్చే శుక్ర‌వారం(జూలై 5)న రిలీజ్ కి రావాల్సి ఉంటుంది. అప్ప‌టికి సమంత న‌టించిన ఓబేబి.. రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి వార‌సుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి న‌టించిన రాజ్ దూత్ చిత్రాలు పోటీ బ‌రిలో ఉన్నాయి. వాటితో పాటు బుర్ర‌క‌థ పోటీప‌డాల్సి ఉంటుంది. సెన్సార్ రూల్స్ విష‌యంలో ప‌ట్టువిడుపు ఉండాల‌ని ఇదివ‌ర‌కూ ఆర్జీవీ - మోహ‌న్ బాబు - జె.డి.చ‌క్ర‌వ‌ర్తి వంటి వారు పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇటీవ‌ల వ‌చ్చిన కొత్త అధికారి చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో సెన్సార్ పూర్త‌వ్వ‌డం కాస్తంత క‌ష్టంగానే ఉంటోంద‌ట‌. ప్ర‌తిదీ నియ‌మావ‌ళిని పాటిస్తూ సినిమాల్ని త‌ర‌చి చూస్తున్నార‌ట‌.