Begin typing your search above and press return to search.
ఆ షాట్స్‌కు సెన్సార్ క్లియరెన్స్ దొరకలేదా?
By: Tupaki Desk | 14 July 2015 8:08 AM GMTబాహుబలి ఇంటా బైటా రికార్డుల మోత మోగిస్తోంది. విదేశాల నుంచి డాలర్లు కురిపిస్తోంది. భాషతో పనేలేకుండా ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు. టిక్కెట్ల కోసం థియేటర్ క్యూలో తన్నుకునే పరిస్థితి. అయితే ఇంత క్రేజు ఉన్న ఈ సినిమాలో చాలా లోపాలున్నాయంటూ విమర్శకులు బాణాల్ని ఎక్కుపెట్టారు. అసంపూర్ణమైన పాత్రలన్నిటి వల్ల సరైన క్లారిటీ మిస్సయ్యిందంటూ విభేధించారు.
అయితే వీటన్నిటికీ సమాధానంగా రాజమౌళి అండ్ టీమ్ సెకండ్ పార్ట్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల్ని ట్రైలర్‌గా కట్ చేసి .. క్యూబ్ థియేటర్లకు పంపించింది. అక్కడ సినిమా ఎండింగ్‌లో ఈ ట్రైలర్‌ని యాడ్ చేస్తున్నారు. దీంట్లో కొన్ని పాత్రలు రెండో భాగంలో ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకునే ఛాన్సిచ్చారు. రిలీజైన మూడో రోజునుంచే ఈ ట్రైలర్ అందుబాటులోకొచ్చింది. కాని ఈ ట్రైలర్ వస్తూనే వివాదం క్రియేట్ చేసింది.
ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్ అధికారి టి.వి.కె.రెడ్డి ఈ ట్రైలర్‌పై అభ్యంతరం తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్‌కి కూడా సెన్సార్ క్లియరెన్స్ అవసరం. కానీ వాళ్లు దానికోసం మమ్మల్ని సంప్రదించలేదని అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ట్రైలర్ సెన్సార్ చేశాకే థియేటర్లలోకి వదలాల్సి ఉంటుంది. రాజమౌళి అండ్ టీమ్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.