Begin typing your search above and press return to search.

ఆ సెక్స్ సీన్ గురించే డిస్కషన్

By:  Tupaki Desk   |   8 April 2017 9:22 AM GMT
ఆ సెక్స్ సీన్ గురించే డిస్కషన్
X
ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ఏప్రిల్ 13 నుంచి మే 15కు వాయిదా పడిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘బాహుబలి-2’ రావడానికి ఇంకా 15 రోజులుండగా మంచి రిలీజ్ డేట్ దొరికితే దాన్ని వదిలేసి.. ‘బాహుబలి-2’ వచ్చిన వారం రోజులకు రిస్కీ రిలీజ్ డేట్ ఎంచుకోవడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐతే సెన్సార్ వాళ్లు ఇచ్చిన షాక్ వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని సమాచారం. సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని.. కథకు కూడా కీలకమని భావించిన సన్నివేశాన్ని లేపేయమనడంతోనే ఏకంగా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ అడల్ట్ కామెడీ ‘హంటర్’కు రీమేక్ అయిన ‘బాబు బాగా బిజీ’లో ఒక హాట్ హాట్ సెక్స్ సీన్ ఉంటుందట. ఆ సీన్‌ ను హిందీలో మాదిరే చాలా బోల్డుగా తీశారట. ఆ సీన్ అలాగే ఉంచడానికి సెన్సార్ వాళ్లు ససేమిరా అన్నారట. దీంతో రివైజ్డ్ కమిటీకి వెళ్దామన్న ఆలోచనతో రిలీజ్ డేట్ మార్చారట. రివైజ్డ్ కమిటీ అంటే వెంటనే తేలే వ్యవహారం కాదు కాబట్టి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వారం తప్పితే.. మళ్లీ రెండు వారాలకు వరకు అవకాశం లేదు కాబట్టి ‘బాహుబలి-2’ వచ్చిన తర్వాతి వారానికి సినిమాను షెడ్యూల్ చేశారు.

తెలుగులో కొన్ని సినిమాలకు స్థానిక సెన్సార్ బోర్డు తిరస్కారం తెలిపినా.. రివైజ్డ్ కమిటీ ఆమోద ముద్ర వేసిన సందర్భాలున్నాయి. ఆ ఆశతోనే ఉంది ‘బాబు బాగా బిజీ’ టీం. ఐతే అక్కడ కూడా తేడా వస్తే ఎందుకైనా మంచిదని.. ఆ సీన్లో డోస్ తగ్గించి రీషూట్ కూడా ప్లాన్ చేశారట. రివైజ్డ్ కమిటీ కూడా ఒప్పుకోకుంటే రీషూట్ చేసిన సీన్ పెట్టేస్తారట. ఐతే ఈ సీన్ విషయంలో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో జరుగుతున్న చర్చ పుణ్యమా అని ఆ సీన్ తో పాటు సినిమాపై జనాల్లో క్యూరియాటీ పెరిగిపోతోంది. అది ‘బాబు బాగా బిజీ’ టీంకు ఉత్సాహాన్నిచ్చేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/