Begin typing your search above and press return to search.
'సైరా' పాన్ ఇండియా పాట్లు ఏమిటో ఇలా
By: Tupaki Desk | 27 Sep 2019 5:08 AM GMTతొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం `సైరా నరసింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అభిమానులు గత కొన్నేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రమిది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా కొద్దీ మేకర్స్ తో పాటు అభిమానును టెన్షన్ కు గురిచేస్తోంది. ఆ స్థాయిలో ఈ చిత్రంపై లెక్కకు మించిన అవాంతరాలు పుట్టుకొచ్చాయి. ఉయ్యాలవాడ వారసులు సినిమా మేకర్స్ పై కోర్టుకు వెళ్లడం .. పరిహారం ఇవ్వడం లేదని.. సినిమా విడుదల నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించడంతో డ్రామా మొదలైంది.
ఇక కోర్టులో ఇది ఉయ్యాలవాడ బయోపిక్ కానే కాదని దర్శకుడు చెప్పాడని.. దీంతో సెన్సార్ సభ్యులు సోమవారం వరకు వేచి చూస్తామని సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని.. బాలీవుడ్ వెర్షన్ సెన్సార్ కూడా అడ్డంకులు ఎదురయ్యేలా వున్నాయని..ఇలాంటి ప్రచారంతో చిరు అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని కూడా విస్మయానికి గురిచేసింది.
ఇంత రచ్చ జరుగుతుంటే `సైరా` సెన్సార్ అనేది మరో సమస్యగా మారింది. చిట్టచివరికి గురువారం సాయంత్రం సర్టిఫికెట్ వచ్చేసింది. ఇక మిగిలింది హిందీ వెర్షన్ సర్టిఫికెట్. ఆ కార్యక్రమాలు ఈ రోజు (శుక్రవారం) పూర్తిచేయనున్నారు. తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయిపోయింది. ఈ స్థాయి గందరగోళాల మధ్యే `సైరా` ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రమోషన్ ఆలస్యమైంది. మరో పక్క ఫైనల్ సౌండ్ పై క్లారిటీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. అది పూర్తయితే కానీ క్యూబ్ ప్రింట్ ని ఫైనల్ చేసే అవకాశం లేదు. ఎంత ప్లాన్ చేసినా మేకర్స్ కి `సైరా` పాన్ ఇండియా పాట్లు.. చివరి నిమిషం టెన్షన్ లు తప్పడం లేదు.
ఇదిలా వుంటే హిందీ చిత్రం `వార్` కూడా `సైరా`కు అడ్డుగా మారిందని.. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు కూడా థియేటర్ల కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పోటీపడుతూ `సైరా` టీమ్ తో పోటీకొస్తోందని మరో ప్రచారం. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్ల కోసం చర్చలు మొదలయ్యాయని ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలుకాలేదని మరో ప్రచారం వేడెక్కిస్తోంది. మరి వీటన్నిటినీ నిర్మాత రామ్‌చరణ్ ఎలా అధిగమిస్తారు అన్నది చూడాలి.