Begin typing your search above and press return to search.
లబోదిబోమన్న 'దండుపాళ్యం' గ్యాంగ్
By: Tupaki Desk | 2 Feb 2019 9:32 AM GMTదారిన పోయే వారిని రాళ్లతో ముఖంపై మోది చంపేయడం.. ఇళ్లలో జొరబడి దోచేవన్నీ దోచుకుని.. రేప్ లు చేసి వికృతంగా చంపి నేలపై పొంగి పొర్లిన ఆ రక్తం వాసన చూడడం.. రేప్ లు - హత్యలతో రాగా అట్టుడికించడం .. ఇదీ దండుపాళ్యం గ్యాంగ్స్ సాగించే అరాచకాలు. కళ్ల ముందు కనిపిస్తే చూడలేనంత దారుణాతి దారుణమైన జుగుప్స కలిగించే ఈ కథ కేరళలో ఒరిజినల్ గా జరిగినదేనని తెలుసుకుని ప్రపంచం విస్తుపోయింది. సెన్సేషనలిజమ్ కి ఆస్కారం ఉన్న ఇలాంటి దారుణ క్రైమ్ సబ్జెక్ట్ ను ఎంచుకుని శ్రీనివాసరాజు ఇప్పటికే రెండు సినిమాలు తీశారు. తొలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. రా రస్టిక్ మాస్ మసాలా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలివి.
ఈ జోనర్ లోనే ఇదివరకూ `దండుపాళ్యం 3` చిత్రం రిలీజైంది. రిలీజ్ ముందే ఈ సినిమాలన్నిటికీ సెన్సార్ పరమైన తిప్పలు ఎదురయ్యాయి. ఈ సిరీస్ లో ఏ సినిమా వచ్చినా సెన్సార్ సమస్య అన్నది కామన్ గా మారింది. దండుపాళ్యం 4 ట్రైలర్ ని గత ఏడాది జూన్ లో రిలీజ్ చేసినప్పుడే రకరకాల సందేహాలు కలిగాయి. నాలుగో భాగం కూడా రిలీజ్ వరకూ సందేహమే. ఇప్పటి వరకూ సెన్సార్ పూర్తవ్వలేదు. సెన్సార్ గడపవరకూ వెళ్లినా ఇలాంటి రా రస్టిక్ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రంపై రకరకాల వివాదాలు ముసురుకున్నాయి.
ఇప్పటికీ ఈ సినిమాకి సెన్సార్ ఇచ్చేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయిట. అయినా ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు పంతంతో ఉన్నారు. ఆ మేరకు వివాదంపై ఫిలింఛాంబర్ లో నిర్మాతలు ముచ్చటించారు. ఇక ఈ పాత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలోని క్రైమ్ లో కొత్తదనం ఏం ఉంటుంది? అన్నదానికి నిర్మాత వెంకట్ వివరణ ఇచ్చారు. ``క్రైమ్ ఎప్పుడూ ఒకటే.. అందులో టెక్నాలజీ మారుతుంది అంతే.. నేటి టెక్నాలజీకి తగ్గ ట్రెండ్ ని తాజా దండుపాళ్యం 4లో చూపిస్తున్నాం`` అన్నారు. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస రాజు కంటే ప్రస్తుత దర్శకుడు కె.టి.విజయ్ బాగా తీశారని టీమ్ చెబుతోంది. సుమన్ రంగనాథన్ - సంజన - పూజా గాంధీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు బెనర్జీ దండును తయారు చేసే నాయకుడిగానూ నటించారు.