Begin typing your search above and press return to search.
టైటిల్ కే అభ్యంతరాలా?? టూమచ్
By: Tupaki Desk | 15 Jun 2018 4:05 AM GMTఒక యాక్ట్రెస్ 250 సినిమాలు చేయడం అంటే మాటలా? 40-50 సినిమాలు చేసేటప్పటికే చాలామంది కెరీర్ ఖతం అయిపోతోంది. కానీ మల్లు ఆంటీగా ఫేమ్ సంపాదించుకుని.. ఇంటర్నేషనల్ గా కూడా సాఫ్ట్ పోర్న్ సినిమాలతో అట్రాక్ట్ చేసిన భామ షకీలా. ఈమె నటించిన 250వ చిత్రంకు రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది.
శీలవతి అంటూ అదే జోనర్ లో షకీలా చేసిన మూవీ టీజర్.. ట్రైలర్ ను బాగానే ఆకట్టుకున్నాయి. కాకపోతే సమస్య అంతా సెన్సార్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చింది. అఫ్ కోర్స్.. సెన్సార్ బోర్డుకి- షకీలాకు జన్మజన్మల వైరుధ్యం ఉండి ఉంటుంది లెండి. అయితే.. గతంలో మాదిరిగా కంటెంట్ కి కాకుండా.. ఇప్పుడు ఏకంగా టైటిల్ కే అభ్యంతరాలు చెబుతున్నారు. అదే షకీలాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శీలవతి టైటిల్ అభ్యంతరకరంగా ఉందని.. దాన్ని మార్చాలని సూచించారు. అసలు సినిమా ఏంటో తెలియకుండా.. అందులో ఏం కంటెంట్ ఉందో చూడకుండా టైటిల్ కరెక్ట్ కాదని సెన్సార్ బోర్డ్ ఎలా చెబుతుందని నిలదీస్తోంది షకీలా.
ఇప్పటికే ఆ టైటిల్ పై ప్రమోషన్స్ కూడా చేసుకున్న తర్వాత.. ఇప్పుడు టైటిల్ మార్చేందుకు మేకర్స్ అంగీకరించబోరని.. అది సినిమాకు నష్టాన్ని కలుగ చేస్తుందని షకీలా ఫీలవుతోంది. తమ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాల్సిందిగా సెన్సార్ వర్గాలను షకీలా కోరబోతోందట. మరి షకీలా ల్యాండ్ మార్క్ మూవీపై సెన్సార్ వారు ఎలా రియాక్ట్ అవుతారో?