Begin typing your search above and press return to search.
సెన్సార్ సర్టిఫికేషన్ లో భారీ మార్పులకు కేంద్రం ప్రతిపాదనలు..!
By: Tupaki Desk | 24 Jun 2021 7:30 AM GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం-1952 లో సవరణలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) పై రివిజనరీ అధికారం ఉండేలా 'సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2021' ప్రవేశపెట్టాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పెట్టింది. ఫిలిం సర్టిఫికేషన్ ను మరింత ప్రభావవంతం చేయాలని.. గోప్యతను అరికట్టాలని ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు. దీనిపై జూలై 2 వరకు కేంద్రం ప్రజల అభిప్రాయాన్ని కోరింది.
'సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2021' అమలులోకి వస్తే.. సిబిఎఫ్‌సి ధృవీకరించిన తర్వాత కూడా సినిమాను సమీక్షించే అధికారం కేంద్రానికి ఉంటుంది. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు వంటి వాటికి విరుద్ధమని భావిస్తే ఆ సినిమాపై చర్య తీసుకొనే అవకాశం కేంద్రానికి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం 'భారతీయ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2021' ఆమోదించబడితే.. సినిమాలను సెన్సార్ చేసే విధానంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.
కొన్ని తీవ్రమైన పరిస్థితులలో సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఈ ముసాయిదాలో పేర్కొన్నారట. సినిమాకు జారీ చేసే సర్టిఫికేట్ పై చిత్రనిర్మాతలు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించే 'ఫిల్మ్ సర్టిఫికేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్' ను కూడా ప్రభుత్వం రద్దు చేయనుందని తెలుస్తోంది. సాధారణంగా సినిమాలను 'U' - 'U/A' - 'A' అనే మూడు విభాగాలుగా సెన్సార్ బోర్డు వారు సర్టిఫికేట్ ఇస్తుంటారు.
'U' సర్టిఫికేట్.. ఎలాంటి నియంత్రణ లేకుండా అందరూ సినిమా చూడటానికి అవకాశం కల్పిస్తుంది. 'U/A' - 12 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో సినిమా చూడొచ్చని చెబుతుంది. 'A' సర్టిఫికెట్ వస్తే అది పెద్దలకు మాత్రమే చూడదగిన సినిమాగా వర్గీకరిస్తారు. అయితే ఇప్పుడు బిల్లు ముసాయిదాలో చేర్చిన అంశాల ప్రకారం.. 'U/A' సెన్సార్ సర్టిఫైడ్ చిత్రాలను వయస్సు ఆధారంగా 3 వర్గాలుగా విభజించనున్నారు. 'U/A 7+' - ఏడేళ్లకు పైబడిన.. 'U/A 13+' - 13 ఏళ్లకు పైబడిన.. 'U/A 16+' - 16 ఏళ్లకు పైబడిన వర్గాలుగా సినిమాలకు సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలుస్తోంది.