Begin typing your search above and press return to search.

కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన కార్తికేయ.. కానీ టార్గెట్..??

By:  Tupaki Desk   |   20 March 2021 2:30 PM GMT
కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన కార్తికేయ.. కానీ టార్గెట్..??
X
ఈమధ్య తెలుగులో మంచి బజ్ తో విడుదలైన సినిమా ఏదైనా ఉందంటే అది 'చావు కబురు చల్లగా' మూవీ మాత్రమే. మొదటి నుండి కూడా ఈ సినిమా అటు పోస్టర్ లతో ఇటు పాటలతో ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేసింది. ఇక సినిమా ట్రైలర్ అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. మరి ఇటీవలే మార్చ్ 19న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో.. ఫస్ట్ డే థియేటర్ టాక్ మాత్రం నెగటివ్ వచ్చింది. కానీ మొత్తానికి సినిమా మోస్తరు హిట్ అని చెప్పవచ్చు. అయితే కార్తికేయ కెరీర్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమా ఇది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

చావుకబురుచల్లగా మూవీ కార్తికేయ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని టాక్. ఏంటంటే.. ఈ సినిమా దాదాపుగా ఐదారు కోట్లతో తెరకెక్కిందట. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 13కోట్ల టార్గెట్ సెట్ చేసింది. కానీ మొదటిరోజు సినిమా టాక్ సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 1.58 కోట్లు షేర్ వసూల్ చేసిందట. టోటల్ గా 2.5 కోట్లు గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది. నైజాంలో 61 లక్షలు, సీడెడ్‌లో 28 లక్షలు, ఉత్తరాంధ్రలో 20 లక్షలు, ఈస్ట్‌లో 12లక్షలు, వెస్ట్‌లో 7 లక్షలు, గుంటూరులో 11లక్షలు, కృష్ణాలో 12 లక్షలు, నెల్లూరులో 7 లక్షలతో వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం. ఈ సినిమా బిజినెస్ పరంగా 13కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.50 కోట్లుగా నిలిచింది. మరి ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 11కోట్ల పైనే వసూల్ చేయాల్సి ఉంది. చూడాలి మరి చావుకబురుచల్లగా చిత్రం అందుకుంటుందేమో!