Begin typing your search above and press return to search.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో బెస్ట్ గా నిలిచిన 'చావు కబురు చల్లగా'

By:  Tupaki Desk   |   18 March 2021 5:30 AM GMT
ప్రీ రిలీజ్ బిజినెస్ లో బెస్ట్ గా నిలిచిన చావు కబురు చల్లగా
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ''చావు కబురు చల్లగా''. పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రేపు మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ అంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ నేపథ్యంలో 'చావు కబురు..' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది.

'చావు క‌బురు చ‌ల్ల‌గా' చిత్రానికి అన్ని క‌లుపుకొని ఇప్ప‌టికే దాదాపుగా 13.5 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి పోగా, సుమారు 4.5 కోట్ల లాభాల‌తోనే విడుద‌ల అవుతుంద‌ని స‌మాచారం. ఇది కార్తికేయ కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగ‌ర్స్ తో వస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఇక 'చావు కబురు..' స్టోరీ విషయానికొస్తే భర్త చనిపోయిన మల్లికని ప్రేమలో పడేయడానికి ట్రై చేసే బస్తీ బాలరాజ్ కథే ఇది. వినూత్న‌మైన ఈ క‌థ‌ని హాస్య‌పూరిత‌మైన క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు కౌశిక పేగ‌ళ్ల‌పాటి ఈ సినిమాని సిద్ధం చేశాడని తెలుస్తోంది. మరి కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.