Begin typing your search above and press return to search.

3గంటల సినిమాకి 3రోజుల రివ్యూ!!!

By:  Tupaki Desk   |   6 Aug 2015 10:34 PM GMT
3గంటల సినిమాకి 3రోజుల రివ్యూ!!!
X
తెలుగు పురాణాలపై, ప్రవచనాలపై మక్కువ ఎక్కువ వుండేవారిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి పేరు తెలియనివారుండరు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్నో ఏళ్ళ క్రితం మొదలైన ఆయన ప్రసంగ తరంగాలు ఇప్పుడు ఆంధ్రదేశమంతా వ్యాపించాయి.

కే.విశ్వనాధ్, సినిమా అనే కళ ద్వారా ఎన్నో కళలను కళ్ళకు కట్టిన దర్శకుడు. నిరంతర కృషి, అమోఘమైన టాలెంట్ తో అపురూపమైన కళాఖండాలను ఆ కాలంలో మనకు అందించిన మహా మేధావి.

విశ్వనాధ్ గారి అద్భుత సృష్టిలో ఒకటైన 'శంకరాభరణం' సినిమా ఇప్పటికీ ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. హీరో అన్న పదానికి పది మైళ్ళు దూరంలో వుండే సోమయాజులుగారి చేత ప్రధాన పాత్ర పోషింపజేసి, మంజు భార్గవి చేత కేవలం హావభావాలతో నటనని రాబట్టి సంగీత ప్రాధాన్యంగా తెరకెక్కి ఆకాలంలో దుమ్ము దులిపిన సినిమా.

నేటి యువతకు ఆ సినిమా ఆవశ్యకత తెలియవలిసిన అవసరం ఎంతో వుంది. నాటి యువతకు ఈ సినిమా జ్ఞాపకాలను మరొక్కసారి నెమరువేసుకోవాలని వుందనే భావనతో ఈ మూడు గంటల సినిమాను ఉద్దేశించి చాగంటి గారు ఈ నెల 8,9, 10వ తేదిలలో హైదరాబాద్ లో ప్రసంగం చేయనున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక గొప్ప సందర్భమని ఆ కాలపు ప్రముఖులంతా పేర్కొనడం విశేషం. అందుబాటులో వుంటే మీరూ వినిరండి మరి..