Begin typing your search above and press return to search.

భార్య కోసం ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న టీమిండియా క్రికెటర్

By:  Tupaki Desk   |   18 Jan 2023 7:30 AM GMT
భార్య కోసం ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న టీమిండియా క్రికెటర్
X
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ముందుగానే హైదరాబాద్ చేరుకున్న ఇండియన్ క్రికెట్ టీం ఆటగాళ్లు... నగరానికి చెందిన వ్యాపారవేత్త నజీర్ ఖాన్ ఇంటికి వెళ్లారు. నజీర్ ఖాన్ ఇంట జరుగుతున్న ఒక ఫంక్షన్‌కి సంబంధించి వారికి ఆహ్వానం అందడంతో వారంతా అతని ఇంటికి వెళ్లగా... అదే ఈవెంట్‌కి అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్‌ను వారంతా కలుసుకున్నారు.

ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌తో ఆటగాళ్లందరూ ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ యూనిట్‌తో కలిసి ఇటీవలే అమెరికాలో జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన విషయం తెలిసిందే. అక్కడే కీరవాణి ఈ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు అందుకోవడంతో టీమిండియా క్రికెటర్లందరూ ఎన్టీఆర్‌ని చూసి ఆయనతో సమయం గడిపారు.

హైదరాబాదులో అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న నజీర్ ఖాన్‌కు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు స్నేహితులున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్లేయర్లను నజీర్ ఖాన్ తన ఇంటికి ఒక ఫంక్షన్ నిమిత్తం ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అదే ఫంక్షన్‌కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్‌తో ఆటగాళ్లందరూ ఫోటోలు దిగి ఆ ఫోటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశారు.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే.. కొంతమంది ఆటగాళ్లు తమ భార్యలతో ఈ ఫంక్షన్‌కి హాజరు కాగా మరికొందరు మాత్రం సింగిల్‌గానే వచ్చారు. అలా సింగిల్‌గానే వచ్చిన చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ కోసం ఎన్టీఆర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఫోటో కూడా సోషల్ మీడియా లీక్ అవ్వడంతో అది వెంటనే వైరల్‌గా మారింది. ఆ మధ్య ధన శ్రీ వర్మ విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరగింది.

తాజాగా తన భార్య కోసం ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చాహల్ తీసుకోవడంతో ఆ ప్రచారం అంతా వట్టిదే అని తేలింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఆయన కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.