Begin typing your search above and press return to search.

చై 'థాంక్యూ'పై టాక్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   22 July 2022 5:12 AM GMT
చై థాంక్యూపై టాక్ ఎలా ఉంది?
X
నాగ‌చైత‌న్య వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్నాడు. మ‌జిలీ-బంగార్రాజు-ల‌వ్ స్టోరి చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. అత‌డు క‌థానాయ‌కుడిగా న‌టించిన థాంక్యూ ఈరోజు విడుద‌లైంది.

విక్ర‌మ్.కె.కుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీపై రిలీజ్ ముందు ఆశించినంత బ‌జ్ లేని సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ పోస్ట‌ర్ల‌తో ఈ మూవీపై స‌రైన హైప్ ని తేవ‌డంలో టీమ్ విఫ‌ల‌మైంద‌ని విమర్శ‌లొచ్చాయి. ఎట్ట‌కేల‌కు మూవీ ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. అయితే దీనిపై తొలి రిపోర్ట్ ఎలా ఉంది? ప్రివ్యూలు వీక్షించిన వారు ఏం చెబుతున్నారు? అంటే ..!

థాంక్యూలో నాగ‌చైత‌న్య కొంత వ‌ర‌కూ కొత్త‌ద‌నం ప్ర‌య‌త్నించాడు. ప్రేమమ్ తరహాలో నాగ చైతన్య తన 3 షేడ్ రోల్ లో అదరగొట్టాడు. త్రిపాత్రాభినయంలో విభిన్నంగా కనిపించాలని ప్రయ‌త్నించినా అది ఏమంత క‌నెక్ట్ కాలేదు.

ప్ర‌థ‌మార్థం కొంత బోర్ కొట్టినా కానీ.. అభిరామ్ గా చై ప్రేమ‌స‌న్నివేశాల్లో ఆక‌ట్టుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆశించినంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ద్వితీయార్థంలో పోకిరి సీన్స్ ప్ర‌ధాన అస్సెట్. మ‌హేష్ అభిమానుల‌ను ఇవి ఎగ్జ‌యిట్ చేస్తాయి. ఇక సిస్ట‌ర్ సెంటిమెంట్ సీన్లు ఓకే. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్. ఇక క‌థానాయిక‌ మాళవిక నాయర్ బాగా న‌టించింది.

అస‌లు ఈ సినిమాలో ఏం మిస్స‌య్యింది? అంటే.. య‌థావిధిగా ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మిస్స‌య్యింది. దానికి తోడు ఫీల్ గుడ్ థాట్స్ ప్రేక్ష‌కుల‌కు క‌ల‌గ‌వు. బలమైన సంఘర్షణ వ‌ర్క‌వుట్ కాలేదు.

విక్ర‌మ్ కె ఎత్తుగ‌డ‌లు ఏవీ ఫ‌లించ‌లేదు. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఈ మూవీ ఏమంత క‌లిసి రాదు.. అన్న టాక్ వీక్ష‌కుల నుంచి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియ‌ర్ల నుంచి ఈ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.