Begin typing your search above and press return to search.

చైతన్య కోసం చైతన్య!!

By:  Tupaki Desk   |   16 Dec 2015 5:53 AM GMT
చైతన్య కోసం చైతన్య!!
X
యంగ్ ట్యాలెంటెడ్ హీరో నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ప్రేమ‌మ్ రీమేక్‌ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డిఫ‌రెంట్ ఏజెస్‌ లో డిఫ‌రెంట్ గాళ్‌ ఫ్రెండ్స్‌ తో హీరో ఎలా ఎంజాయ్ చేశాడు? లైఫ్‌లో చివ‌రికి ఎలా రియ‌లైజ్ అయ్యాడు? అన్న ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌ తో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ఇందులో కాలేజ్ లైఫ్ అనేది ఎంతో క్రూషియ‌ల్‌. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన స‌న్నివేశాల్ని విశాఖ‌ప‌ట్నం ఆంధ్రాయూనివ‌ర్శిటీలో తెర‌కెక్కిస్తున్నారు. చిత్ర‌యూనిట్ గ‌త కొంత కాలంగా వైజాగ్‌ లోనే మ‌కాం వేసింది. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో కాలేజ్ గోయింగ్ సీన్స్ కొన్ని నాగ‌చైత‌న్య అండ్ గ్యాంగ్‌ పై చిత్రీక‌రించారు. చైతూ ఈ ఎపిసోడ్స్‌ లో పూర్తిగా గుబురు గ‌డ్డంతో కాస్తంత ర‌ఫ్‌ గా క‌నిపిస్తాడు. అత‌డికి ఫ్రెండు క్యారెక్ట‌ర్‌ లో చైత‌న్య కృష్ణ నటిస్తున్నాడు. చైత‌న్య అంటే గుర్తొచ్చింది. మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌ - ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ క్యాంపు నుంచి వ‌చ్చిన హీరో ఇత‌గాడు. స్నేహ‌గీతం మూవీతో పాపుల‌ర్ అయ్యాడు. డ్యాన్సులు ఇత‌గాడి యూఎస్‌ పీ. అప్ప‌ట్లో గాయం2 ఫేం డైరక్టర్ తెర‌కెక్కించిన ఓ ఫ్యాక్ష‌న్ సినిమా 'కాళీ చరణ్‌'లో అద‌ర‌గొట్టేసే పెర్ఫామ్ చేశాడు. అయినా అత‌డికి ఆశించిన‌న్ని అవ‌కాశాలైతే రాలేదు. లేటెస్టుగా ప్రేమ‌మ్ రీమేక్ మ‌జ్ను రిలీజైతే మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయేమో చూడాలి.