Begin typing your search above and press return to search.

లీక్‌ పిక్స్‌ః మహేష్‌ కు వీరాభిమానిగా మారిన చైతూ

By:  Tupaki Desk   |   9 March 2021 4:57 AM GMT
లీక్‌ పిక్స్‌ః మహేష్‌ కు వీరాభిమానిగా మారిన చైతూ
X
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక థియేటర్‌ లో జరుగుతోంది. చైతూ టీనేజ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. టీనేజ్ లో మహేష్‌ బాబు కు వీరాభిమానిగా చైతూ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అందుకోసం ఒక్కడు సినిమా విడుదలకు సంబంధించిన సందడి షూటింగ్‌ ను చేస్తున్నారు. థియేటర్ లో ఒక్కడు సినిమా విడుదల సందర్బంగా నాగ చైతన్య భారీ మహేష్‌ బాబు కటౌట్‌ కు పాలాభిషేకం చేయడంతో పాటు ఒక మహేష్‌ అభిమానిగా సందడి చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చైతూ మొదటి సారి ఒక హీరో కు అభిమానిగా కనిపించబోతున్నాడు. థ్యాంక్యూ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో హీరోను ఒక్కడు విడుదల సమయంలో టీనేజ్‌ కుర్రాడిగా చూపించబోతున్న నేపథ్యంలో కథను దర్శకుడు విక్రమ్‌ చాలా విభిన్నంగా చూపించబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌ బాబు కటౌట్‌ ను చైతూ ఎక్కడం పాలాభిషేకం చేయడం వంటి సీన్స్ ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఆ సందర్బంగా అభిమానులు ఫొటోలు వీడియోలు తీశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చైతూ టీనేజ్ లుక్‌ సూపర్బ్‌ అంటూ అక్కినేని అభిమానులు కితాబిస్తున్నారు.