Begin typing your search above and press return to search.

యంగ్ ట్యాలెంట్ తో య‌శ్ రంగినేని సోలో ప్రాజెక్ట్

By:  Tupaki Desk   |   9 March 2022 5:29 AM GMT
యంగ్ ట్యాలెంట్ తో య‌శ్ రంగినేని సోలో ప్రాజెక్ట్
X
`పెళ్లి చూపులు`- `డియర్ కామ్రేడ్`..`దొర‌సాని`..`ఏబీసిడి` లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల నిర్మాణంలో భాగ‌స్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ గురించి ప‌రిచయం అవ‌స‌రంలేదు. తొలి సినిమాతోనే బిగ్ బెన్ సినిమాస్ నిర్మాణంలో త‌న‌దైన మార్క్ వేసింది. స‌దరు నిర్మాణ సంస్థ జాతీయ అవార్డు సైతం అందుకుని నిర్మాణ సంస్థ‌గా ప్రత్యేక‌మైన గుర్తింపుని ద‌క్కించుకుంది. యువ ప్ర‌తిభ‌ను ప్ర‌తోత్స‌హించ‌డంలో బిగ్ బెన్ సినిమాస్ ఎప్పుడూ ముందుటుంద‌ని నిరూపించింది.

నిర్మాణ రంగంలో బిగ్ బెన్ అధినేత య‌శ్ రంగినేని త‌న‌దైన ముద్ర వేసి టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం శ్రీ సింహ కోడూరి హీరోగా `భాగ్ సాలే` అనే చిత్రాన్ని సురేష్ ప్రోడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఇలా అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో టై అప్ అయి నిర్మాణ రంగంలో య‌శ్ రంగినేని ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ని..ఇమ‌జ్ ని క్రియేట్ చేసుకున్నారు. తాజాగా బిగ్ బెన్ ఈసారి ఏకంగా సోలోగానే నిర్మాణ రంగంలోకి దిగుతుంది.

`30 వెడ్స్ 21` ఫేమ్ చైత‌న్య రావ్ మాధాడి హీరోగా బెగ్ బెన్ సినిమాస్ ఓ థ్రిల్ల‌ర్ చిత్రం నిర్మించేందుకు రెడీ అవుతోంది. `ఓ పిట్ట క‌థ` ద‌ర్శ‌కుడు చెందు ముద్దు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

థ్రిల్ల‌ర్ -ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టులు..సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నామ‌ని నిర్మాత య‌శ్ రంగినేని తెలిపారు.

యంగ్ హీరో చైత‌న్య రావ్ తొలి సినిమాతో నే ప్రామింసింగ్ యాక్ట‌ర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ద‌ర్శ‌క‌డు చెందు ముద్దు `పిట్ట క‌థ‌`తో మంచి మేక‌ర్ గా నిర‌పించుకున్నారు. నిర్మాత య‌శ్ రంగినేని కున్న సినిమా ఫ్యాష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కంటెంట్ న‌చ్చిందంటే బ‌డ్జెట్ విష‌యంలో రాజీ ప‌డే త‌త్వం కాదు. ఇలా ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త ప్రాజెక్ట్ పై ఆస‌క్తి నెల‌కొంది.

ఈ కాంబినేష‌న్ కి సంబంధించిన ఓ ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్ తాజాగా యూనిట్ సోష‌ల్ మీడియా తో పంచుకుంది. సినిమా టైటిల్ ..హీరోయిన్ త‌దిత‌ర వివ‌రాలు అతి త్వ‌రలోనే రివీల్ ఛాన్స్ ఉంది.