Begin typing your search above and press return to search.

అనుభవం ఉన్న దర్శకులతోనే చేస్తాడట

By:  Tupaki Desk   |   11 Dec 2019 3:49 PM IST
అనుభవం ఉన్న దర్శకులతోనే చేస్తాడట
X
తన మేన మామతో కలిసి 'వెంకీ మామ' సినిమాతో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్నాడు చైతు. మరో వైపు శేఖర్ కమ్ముల సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా తర్వాత చైతూ లిస్టులో అరడజను దాక కథలు వెయిటింగ్ లో ఉన్నాయి. అందులో కొత్త దర్శకుల కథలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడే కొత్త దర్శకులతో సినిమా చేసే ఆలోచనలో లేనంటూ మనసులో ఉన్నది బయట పెట్టేసాడు చైతూ. అవును మూడు నాలుగు సినిమాల వరకూ అక్కినేని కుర్ర హీరో డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేసే చాన్స్ లేదు.

ఈ నిర్ణయం వెనుక కథను కూడా చైతూ మీడియా ముందు చెప్పేసాడు. అనుభవం ఉన్న దర్శకులు నన్ను రెండో టేక్ అడిగి మరీ నా చేత బెస్ట్ తీసుకుంటారు. కానీ కొత్త దర్శకులు నన్నో స్టార్ లా చూసి రెండో టేక్ అడగకుండానే మొదటి టేక్ నే ఫైనల్ చేసుకుంటారు. అందుకే నటుడిగా ఇంకా ముందుకెళ్ళే ఈ సమయంలో రిక్స్ తీసుకోలేనంటూ చెప్పేసాడు చైతూ. సో ఇప్పుడే దిల్ రాజు బ్యానర్ లో శశితో సినిమా ఉండదన్న మాట.