Begin typing your search above and press return to search.
హిందీ డెబ్యూ.. చై ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే
By: Tupaki Desk | 14 Aug 2021 6:31 AM GMTటాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు నాగచైతన్య. మజిలీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాక అతడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడింది. తొందర్లోనే థియేటర్లలోకి వస్తుంది.
తదుపరి నాగచైతన్య బాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `లాల్ సింగ్ చద్దా` సినిమాతో చైతన్య అక్కినేని హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కథానాయకుడు. చైతూ- అమీర్ లపై కీలక సన్నివేశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నాగచైతన్య తన భాగాన్ని పూర్తి చేశాడు. ఆసక్తికరంగా చైతన్య పాత్ర ఇందులో ఎంతో ఎమోషనల్ గా సాగుతుందని అతడి పాత్ర చనిపోతుందని తెలిసింది. వారియర్ గా మరణించే సన్నివేశాన్ని భావోద్వేగం రేకెత్తించేలా ఆవిష్కరిస్తున్నారని తెలిసింది. ఇందులో చైతన్య అమీర్ తో పాటు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అయితే యుద్ధంలో చనిపోయిన యువ సైనికుడి (చైతన్య) గా చై కనిపిస్తారు. అతడి తల్లిదండ్రులను ఓదార్చేందుకు కాకినాడకు చేరుకుంటారు అమీర్ ఖాన్. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఇంతకుముందు తెరకెక్కించారు.
నిజానికి చైతన్య హిందీ డెబ్యూ ఆకస్మిక నిర్ణయమే. వాస్తవానికి ఈ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సి ఉండగా అతడికి కాల్షీట్ల సర్ధుబాటు కుదరలేదు. అతని స్థానంలో చివరి నిమిషంలో చైతన్య ఓకే అయ్యాడు. అమీర్ తన హోమ్ ప్రొడక్షన్ లో ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఆద్యంతం ఎమోషన్ రగిలించే పాత్రతో అమీర్ ఖాన్ కనిపిస్తారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్ చిత్రమిదని తొలి నుంచి అమీర్ చెబుతున్నారు.