Begin typing your search above and press return to search.
చైతూ సినిమా కూడా ఆగిపోయింది
By: Tupaki Desk | 1 May 2021 8:32 AM GMTకరోనా సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ లు పడ్డాయి. చిన్నా చితకా సినిమాల షూటింగ్ లు పది లేదా ఇరవై మందితో జరుపుతున్నారు కాని పెద్ద సినిమాలు మాత్రం ఆగిపోయాయి. మొండిగా షూటింగ్ జరిపిన కొన్ని సినిమా లు కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. మొత్తంగా హైదరాబాద్ లో ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా మొత్తంగా ఆగిపోయాయి. అయితే ఇటలీకి వెళ్లిన నాగచైతన్య 'థ్యాంక్యూ' మాత్రం కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటూ ఉందని ఇటీవలే వార్తలు వచ్చాయి.
థ్యాంక్యూ సినిమా షూటింగ్ కూడా తాత్కాలికంగా నిలిచి పోయింది. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న థ్యాంక్యూ తో ప్రకాష్ రాజ్ తో పాటు మరి కొందరు నటీ నటులు ఇండియా నుండి జాయిన్ అవ్వాల్సి ఉంది. కాని ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తో లక్షల కేసులు నమోదు అవుతున్న కారణంగా ఇటలీకి ఇండియా నుండి విమానాలను నిలిపి వేశారు. దాంతో వారు థ్యాంక్యూ టీమ్ తో ఇక్కడ నుండి వెళ్లి కలువలేక పోయారు.
షూటింగ్ ప్రకాష్ రాజ్ జాయిన్ కాకుంటే చేయడం కష్టం. ఇప్పటికే అనుకున్న మేరకు సన్నివేశాలను చిత్రీకరించారు. కనుక ప్రస్తుతానికి షూటింగ్ ను నిలిపి వేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఇండియాకు తిరిగి వస్తారా లేదంటే కొన్నాళ్లు అక్కడే వెయిట్ చేస్తారా అనేది చూడాలి. థ్యాంక్యూ సినిమాకు మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.