Begin typing your search above and press return to search.
చైతూ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వానికి దగ్గరగా అనిపించింది: సాయిపల్లవి
By: Tupaki Desk | 23 Sep 2021 10:35 AM GMTనాగచైతన్య జోడీగా సాయిపల్లవి 'లవ్ స్టోరీ' సినిమా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యాన్ని కలుపుకుని సాగే ఒక అందమైన ప్రేమకథ. రేపే ఈ సినిమా విడుదల కానుండటంతో సాయిపల్లవి సాధ్యమైనంత వేగంగా ప్రమోషన్స్ ను కవర్ చేసేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించింది.
'లవ్ స్టోరీ' టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథ. ఇంతవరకూ శేఖర్ కమ్ములగారి నుంచి వచ్చిన ప్రేమకథలు ఎలా అయితే స్వచ్ఛంగా ఉంటాయో .. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఎందుకిలా చెబుతున్నానంటే, సాయిపల్లవి అంటే డాన్సులు ఒక రేంజ్ లో ఉంటాయని అనుకుంటున్నారు. ఇక చైతూ డాన్స్ మాస్టర్ గా కనిపిస్తాడు అని చెప్పేసరికి, ఇది డాన్స్ ప్రధానంగా సాగే కథ అని చెప్పుకుంటున్నారు. డాన్స్ చుట్టూనే ఈ కథ తిరుగుతుందని అనుకుంటున్నారు. ఈ కథలోడాన్స్ ఒక భాగమే తప్ప .. డాన్స్ ప్రధానంగా నడిచే కథ కాదు.
సాధారణంగా శేఖర్ కమ్ములగారి కథల్లో ప్రేమికులు .. వ్యక్తిత్వాలు .. కుటుంబాలు .. అనుబంధాలు అల్లుకుపోయి కనిపిస్తాయి. ఈ సారి ఆయన కథలో వీటితో పాటు సమాజానికి ఇచ్చే సందేశం కూడా ఉంది. మహిళల పట్ల అనేక చోట్ల గల వివక్షను నేను చూస్తూ వచ్చాను. ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నందుకు బాధపడుతూ ఉండేదానిని. కానీ అలాంటి ఒక సమస్యను గురించి ఆలోచింపజేసే సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఇదే.
ఈ సినిమాలో చైతూతో కలిసి నటించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించే విషయం. చైతూను దగ్గరగా చూస్తే ఆయన వ్యక్తిత్వం .. నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉందనిపించింది. ఎందుకంటే ఆయన కూడా నా మాదిరిగానే ఎదుటివారిని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అవతలవారిని సాధ్యమైనంత కంఫర్టుగా ఉంచడానికి ఆరాటపడతారు. నైట్ షూటింగు ఉంటే ముందుగా నాకు సంబంధించిన షాట్స్ ను తీసేసి పంపించమనేవారు.
డాన్స్ విషయంలో నేను చాలా కోపరేట్ చేసినట్టుగా చెప్పడం ఆయన సంస్కారం. అదే నేను ఫైట్స్ చేయవలసి వస్తే ఆయన సహకారాన్ని తీసుకుని ఉండేదానినేమో. ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో కథలు చర్చల దశలో ఉన్నాయి. హిందీ వెబ్ సిరీస్ కి సంబంధించి మాటలు నడుస్తున్నాయి. మలయాళ సినిమాకి సైన్ చేశాను" అని చెప్పుకొచ్చింది.