Begin typing your search above and press return to search.
చైతూ దూకుడు మామూలుగా లేదే!
By: Tupaki Desk | 19 March 2021 3:30 PM GMTకెరియర్ తొలినాళ్లలో కొంచెం తడబడిన నాగచైతన్య, ఆ తరువాత నుంచి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అందుకు ఉదాహరణగా 'మజిలీ' .. 'వెంకీమామ' సినిమాలు కనిపిస్తాయి. ఇక త్వరలో ఆయన నుంచి 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 'సారంగధరియా .. ' పాట ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేస్తోంది. దాంతో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా తరువాత చైతూ .. దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రాజెక్టును పూర్తి చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'థాంక్యూ' సినిమా రూపొందుతోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత చైతూ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టడం విశేషం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించనున్న సినిమాలోనూ ఆయన చేయనున్నాడు. ఆల్రెడీ ఆయన కథ వినిపించడం .. చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోను ఒక సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండటం విశేషం.
గతంలో పరశురామ్ - చైతూ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందవలసి ఉంది. 'సర్కారువారి పాట' కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆ సినిమా పూర్తయిన తరువాత పరశురామ్ తిరిగి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాడు. ఇక 'తొలిప్రేమ' .. 'మిస్టర్ మజ్ను' .. 'రంగ్ దే' సినిమాలను రూపొందించిన వెంకీ అట్లూరితో కలిసి చైతూ ఒక సినిమాను చేయనున్నాడు. పెద్ద బ్యానర్లు .. యూత్ పల్స్ తెలిసిన దర్శకులతో చైతూ సినిమాలను ప్లాన్ చేసుకున్న తీరు బాగుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఇతర యంగ్ హీరోలకు మించిన దూకుడు చూపిస్తున్నాడు. ఈ అరడజను సినిమాలతో చైతూ రేంజ్ ఏ స్థాయివరకూ వెళుతుందన్నది చూడాలి.