Begin typing your search above and press return to search.
చక్ర విషయంలో గేర్ మార్చిన విశాల్..!!
By: Tupaki Desk | 2 Feb 2021 6:30 AM GMTసౌత్ సినీహీరో విశాల్.. ఈ మధ్య గేర్ మార్చినట్లు తెలుస్తుంది. తమ సినిమా సినిమాలను తెలుగులో డబ్ చేసే తమిళ హీరోలలో విశాల్ ఒకరు. తెలుగువాడే అయినప్పటికీ సెటిల్ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే.. కానీ తన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తుంటాడు. విశాల్ నుండి పందెంకోడి, భరణి, అభిమన్యుడు లాంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాయి. విశాల్ కు తెలుగు రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఉంది. అందుకే తన సినిమాలన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. గతకొంత కాలంగా విశాల్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన ‘చక్ర’ సినిమా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఎంఎస్ ఆనందన్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు విశాల్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. అలాగే రెజినా కూడా ఓ కీలకపాత్రలో నటించింది.
భారీ దొంగతనాలను చేధించే క్రమంలో మిలిటరీ ఆఫీసర్ విశాల్, ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటాడనే నేపథ్యంలో సినిమా ఉంటుందని ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను విశాల్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నిజానికి చక్ర సినిమా మొదట ఓటిటిలో రిలీజ్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ నిన్నటి వరకు ఈ సినిమా రిలీజ్ పై ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు విశాల్. ఆ మధ్య లాక్ డౌన్ లోనే సినిమాను జీ5 వారు వ్యూస్ లెక్కన కొనుగోలు చేసారని త్వరలో రిలీజ్ డేట్ వస్తుందని కథనాలు వెలువడ్డాయి. కానీ మొత్తానికి సినిమాను ఫిబ్రవరి 19న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించి షాకిచ్చాడు విశాల్. తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా కన్నడ మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా - విశాల్ కాంబినేషన్ లో వస్తున్న 10వ సినిమా ఇది. ఓటిటి బేరం కుదుర్చుకొని మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు టాక్. చూడాలి మరి థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్, సాటిలైట్ హక్కులను అమ్ముతాడేమో..