Begin typing your search above and press return to search.
మంచి ఆడియో.. చెత్త కామెంట్లలో కొట్టుకుపోతోంది
By: Tupaki Desk | 23 May 2017 5:30 PM GMTఅక్కినేని నాగార్జున నిర్మాణంలో ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన రెండో సినిమా కావడం.. నాగచైతన్య ‘ప్రేమమ్’ లాంటి హిట్టు తర్వాత చేసిన సినిమా కావడం.. నాగ్ సొంత బేనర్లో ఈ సినిమాను నిర్మించడంతో ‘రారండోయ్..’ మీద పాజిటివ్ బజ్ క్రియేటైంది. దీనికి తోడు ప్రోమోస్.. పాటలు.. ట్రైలర్ అన్నీ కూడా జనాలకు మంచి ఫీలింగే ఇచ్చాయి. ఇలాంటి టైంలో ఆడియో వేడుకతో సినిమాపై హైప్ మరింత పెంచాలని భావించాడు నాగార్జున.
దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలు కూడా ఇవ్వడంతో ‘రారండోయ్..’ విడుదలకు ముందు ఐదారు రోజులు ఈ సినిమాపై పాజిటివ్ డిస్కషన్ నడుస్తుందని అనుకున్నారు. కానీ సీనియర్ నటుడు చలపతిరావు పుణ్యమా అని ఈ సినిమా.. చెత్త విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఆడియో వేడుక సందర్భంగా చలపతి రావు అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ లేకి వ్యాఖ్యలు చేయడంతో దాని మీద రెండు రోజుల నుంచి పెద్ద దుమారమే రేగుతోంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అన్ని వైపుల నుంచి ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రారండోయ్..’ ఆడియో గురించి కానీ.. ఆడియో వేడుకలో జరిగిన మిగతా మంచి విషయాలు.. ప్రసంగాల గురించి కానీ.. డిస్కషనే లేదు. చర్చంతా చలపతి రావు గురించే. ఫలానా ఆడియో వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆ సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ వస్తోంది. ఏదో రకంగా సినిమా వార్తల్లో ఉంది కదా అనుకోవడానికి లేదు. ఈ సినిమాపై మామూలుగా పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పుడు వస్తున్నది నెగెటివ్ పబ్లిసిటీ. ఇది అంత మంచిది కాదు. మొత్తానికి ఒక్క వ్యాఖ్యతో చలపతిరావు పెద్ద కలకలమే రేపారు. ఈ సినిమాకు చాలా చేటు చేశారు.