Begin typing your search above and press return to search.

మూడు త‌ర‌ల న‌టుల‌తో చ‌ల‌ప‌తిరావు మ‌మేకం!

By:  Tupaki Desk   |   25 Dec 2022 4:35 AM GMT
మూడు త‌ర‌ల న‌టుల‌తో చ‌ల‌ప‌తిరావు మ‌మేకం!
X
ప్ర‌ముఖ న‌టుడు చ‌ల‌ప‌తిరావు సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఐదు ద‌శాభ్దాల సుదీర్ఘ ప్ర‌యాణం ఆయ‌నది. న‌టుడిగా ఆయ‌న స్థానం చిర‌స్మ‌ర‌ణీయం. దాదాపు 1200 సినిమాల్లో నటించి ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర వేశారు. నాటి-మేటి న‌టుల‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. 1966 లో సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన `గుఢ‌చారి 116 తో తెరంగేట్రం చేసారు. అటుపై ఎన్టీఆర్ ..ఏఎన్నార్ స‌హా అప్ప‌టి సీనియ‌ర్ హీరోలంద‌రితోనూ క‌లిసి ప‌నిచేసారు.

ఆ త‌ర్వాత త‌రం చిరంజీవి..వెంక‌టేష్..నాగార్జున‌...బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఎన్నోసినిమాల్లో న‌టించారు. నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తోనూ క‌లిసి ప‌నిచేసారు. ఇలా మూడు త‌రాల నటులతో ఆయ‌న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. `యమగోల`.. `యుగపురుషుడు`.. `డ్రైవర్ రాముడు`.. `అక్బర్ సలీమ్ అనార్కలి`.. `భలే కృష్ణుడు`.. `సరదా రాముడు`.. `జస్టిస్ చౌదరి`.. `బొబ్బిలి పులి`.. `చట్టంతో పోరాటం`.. `అల్లరి రాముడు`.. `అల్లరి`.. `నిన్నే పెళ్లాడతా`..` సింహాద్రి`.. `బన్నీ`.. `బొమ్మరిల్లు`...`అరుంధతి`.. `సింహా`.. `దమ్ము`.. `లెజెండ్` ఇలా ఎన్నో వందల సినిమాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు.

ప్ర‌తినాయ‌కుడుగా..క‌మెడియ‌న్ గానూ చ‌ల‌ప‌తి రావు మార్క్ క‌నిపిస్తుంది. ఆయ‌న కెరీర్ లో ఎక్కువ‌గా ప్ర‌తి నాయ‌కుడు పాత్ర‌లే క‌నిపిస్తాయి. విల‌నీగా చ‌ల‌ప‌తి రావు ప్ర‌త్యేక‌మై ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. స‌హాయ న‌టుడిగానూ ఎన్నో పాత్ర‌లు పోషించారు.

చివ‌రిగా ఇదే ఏడాది రిలీజ్ అయిన `బంగార్రాజు`లోనూ న‌టించారు. `కలియుగ కృష్ణుడు`..`క‌డ‌ప రెడ్డ‌మ్మ‌`... `జ‌గ‌న్నాట‌కం`..`పెళ్లంటే నేరేళ్ల పంట` వంటి చిత్రాల‌కు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ తో చ‌ల‌ప‌తిరావు అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. చలపతి రావు చివరిసారిగా ఇదే ఏడాది విడుదలైన `బంగార్రాజు` చిత్రంలో కనిపించారు.

`చ‌ద‌రంగం` అనే ఓ వెబ్ సిరీస్ లో న‌టించారు. ఈ వెబ్ సిరీస్ జీ-5లో స్ర్టీమింగ్ అయింది. ఆర‌కంగా చ‌ల‌ప‌తిరావు ముద్ర వెబ్ సిరీస్ ల‌పైనా ప‌డింది. కుమారుడు ర‌విబాబు తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. వాటిలో `అల్ల‌రి` ఎంతో ప్ర‌త్యేక‌మైన చిత్రం. వైవిథ్య‌మైన పాత్ర‌లో చ‌ల‌ప‌తి రావు న‌ట‌న ఆక‌ట్టుకుంది. కామెడీ జాన‌ర్ లో ఆయ‌న‌కు కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది.