Begin typing your search above and press return to search.

'నువ్వు వెళ్లి పోయావా' పోస్ట్ నెట్టింట వైర‌ల్!

By:  Tupaki Desk   |   26 Dec 2022 3:40 AM GMT
నువ్వు వెళ్లి పోయావా పోస్ట్ నెట్టింట వైర‌ల్!
X
కొన్నిసార్లు జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంటుంది. మృత్యువు కూడా ఎప్పుడు ఎలా క‌బ‌ళిస్తుందో తెలియ‌దు. క‌రోనా స‌మ‌యంలో ఈ విష‌యం ఇంకా బాగా అర్ధ‌మైంది. ముందు రోజు క‌నిపించిన మ‌నిషి మ‌రుసుటి రోజు క‌నుమ‌రుగ‌య్యే పరిస్థితి. మ‌నిషికి వైర‌స్ భ‌యం అనేది ఆ ర‌కంగా వెన్నులో ఒణుకు పుట్టించింది. తాజాగా మ‌రోసారి వ‌రుస‌గా టాలీవుడ్ ప్ర‌ముఖులు స్వ‌ర్గ‌స్తుల్ల‌వ్వ‌డం ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌...కైకాల స‌త్య‌నారాయ‌ణ తాజాగా సీనియర్ న‌టుడు చలపతిరావు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ‌ర‌ణించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితమే చ‌ల‌ప‌తి రావు ట్విట్టర్‌లో చేసిన ఓ ఓ పోస్ట్ ఇప్పుడు ఆయన అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

'నువ్వు కూడా వెళ్లిపోయావా సత్తెన్నా?' అంటూ చలపతిరావు పెట్టిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. గతంలో కృష్ణ‌ కృష్ణంరాజు గారు మరణించినప్పుడు అతను ఇలాంటి పోస్ట్ చేసి "నువ్వు కూడా వెళ్లిపోయావా అన్నా' అని రాసుకొచ్చారు. ఆయా హీరోల ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇలా సంఘీభావం ప్ర‌క‌టించిన చ‌ల‌ప‌తిరావు కూడా మ‌ర‌ణించ‌డంతో అభిమానులు మ‌రింత‌గా భావోద్వేగానికి గుర‌వుతున్నారు. ప్రతిభావంతులైన నటుడు తన తోటి కళాకారులను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేసారు. ఇప్పుడు అతను కూడా వారితో కలిసి స్వర్గంలోకి వెళ్లిపోయారా? అంటూ నెటి జ‌నులు పోస్ట్లు పెడుతున్నారు.

సాధారణంగా చలపతిరావు తన పోస్ట్‌లు ఎక్కువ‌గా లెజెండరీ న‌టుడు ఎన్టీఆర్‌తో ఏదో ఒక విధంగా లింక్ చేయబడి ట్విట్టర్‌లో ఆసక్తికరంగా ఉంటాయి. మెగాస్టార్ చిరు వంటి ఇతర పెద్ద స్టార్‌ల పుట్టినరోజులకు విష్ చేయడానికి కూడా చ‌ల‌ప‌తిరావు ఎన్టీఆర్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ విష్ చేసారు.

అలాగే ఈ సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్‌కు సంబంధించిన చాలా పాతకాలపు చిత్రాలను త‌రూచూ పంచుకునేవారు. చ‌ల‌ప‌తి రావు తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన మద్దతుదారుడుగా ఉండేవారు. ఆ పార్టీకి అనుకూలంగా తన అభిప్రాయాలను వ్యక్తప‌రుస్తుంటారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.