Begin typing your search above and press return to search.
ఒకే మూవీలో ఐదు పాత్రలు చేసిన నటుడు
By: Tupaki Desk | 25 Dec 2022 7:15 AM GMTటాలీవుడ్ క్లాసిక్ `దానవీరశూరకర్ణ`లో ఒకటికి మించిన పాత్రలతో పలువురు నటులు ఆశ్చర్యపరిచే నటనతో ఆకట్టుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ అసమాన నట ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమిది.
ఈ చిత్రంలో ఓవైపు తారకరాముడు నాలుగు పాత్రల్లో అద్భుత ప్రదర్శనతో మైమరిపిస్తుంటే మరోవైపు ఇదే చిత్రంలో ఐదు పాత్రల్లో నటించి నటుడు చలపతిరావు ఔరా అనిపించాడు. అవి మరీ అంత పెద్ద పాత్రలు కాకపోవచ్చు. కానీ అవి సమయోచితంగా ఆకట్టుకునేవి. ఈ పౌరాణిక గాధలో సూతుడు,.. ఇంద్రుడు,... జరాసంధుడు,... ద్రుష్టద్యుమ్నుడు.. విప్రుడుగా ఐదు పాత్రల్లో చలపతిరావు కనిపించారు.
ఇక ఇదే చిత్రంలో సూర్యునిగా.. ఏకలవ్యునిగా జయభాస్కర్ నటించారు. హలం,.. జయమాలిని నృత్యతారలుగా తళుక్కుమన్నారు. అయితే ఈ చిత్రంలో చలపతిరావు ఒక్కడే ఐదు పాత్రలు చేసినట్టు ఆడియెన్ అయితే గుర్తించలేరు. ఇది చాలా గమ్మత్తయిన వ్యవహారం. అప్పటికి ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన ఆరాధకుడిగా పరిశ్రమలో కొనసాగుతున్న చలపతిరావుతో ఐదు పాత్రలు చేయించేశారు ఎన్టీవోడు.
2022 జనవరి 14 నాటికి NTR `దానవీరశూరకర్ణ`కు 45 ఏళ్ళు నిండాయి. 2027 నాటికి 50 సంవత్సరాల (అర్థ శతకం) ఉత్సవాలను నవరసనటసార్వభౌమ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా ప్లాన్ చేస్తారనడంలో సందేహం లేదు. నాటి మేటి క్లాసిక్ కి ఆరాధకులు ఇప్పటికీ కళాభారతి- గురజాడ కళాక్షేత్రల్లో పౌరాణిక డ్రామాల్లో ఎన్టీఆర్ ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
హస్తిన కథలో ఎన్నో మరపురాని పాత్రలు..!
`దానవీరశూర కర్ణ` చిత్రం కథాంశం అందులో పాత్రలు ఎంతో ఔన్నత్యంతో అద్భుతమైనవి. ఓ పెట్టె నీటిలో కొట్టుకుంటూ రావడంతో సినిమా మొదలవుతుంది. అది సూత పరివారానికి లభిస్తుంది. అందులో సహజకవచ కుండలాలతో ఉన్న బాలుడు దర్శనమిస్తాడు. అతనికి కర్ణ అని పేరు పెట్టుకొని రాధ పెంచడంతో కథ మొదలవుతుంది. రాధేయుడు దానవీరశూర కర్ణగా వెలుగొందుతాడు. పరశురాముడు- విప్రుడు- భూమాత ఒసగిన శాపంతో హస్తినకు చేరుకుంటాడు కర్ణుడు. అక్కడ కురుపాండవ కుమారుల నడుమ సాగుతున్న యుద్ధ విద్యాప్రదర్శనలో అర్జునునికి సరిజోదు ప్రపంచలోనే లేడని ద్రోణాచార్యుడు ప్రకటించడాన్ని విని తానున్నానని చెబుతాడు కర్ణుడు. అక్కడ సూత కుమారుడు అన్న మాటతో అతనికి అవమానం జరుగుతుంది.
అప్పుడే రారాజు అతణ్ణి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు. తనకు తగిన గౌరవం కల్పించిన సుయోధన సార్వభౌముని కోసం తుది రక్తపు బిందువు వరకు పోరాడుతానని ప్రకటిస్తాడు కర్ణుడు. మయసభలో సుయోధనుని తడబాటు.. పాంచాలి నవ్వడం,.. తరువాత జూదంలో పాండవులు ఓడిపోవడం,.. పాంచాలి పరాభవం,.. పాండవుల దాస్యవిముక్తి,.. మళ్ళీ పాచికలాటలో పాండవులు ఓడిపోయి వనవాస,.. అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకోవడం తరువాతి అంశాలు. ఆపై కృష్ణుని కడకు సుయోధన,.. అర్జునులు వెళ్ళి సాయం కోరడం, .. కురుపాండవుల మధ్య సంధి కోసం శ్రీకృష్ణరాయబారం,.. పిమ్మల కురుక్షేత్రం సాగడం. కర్ణుని భీష్ముడు అర్థరథుడని ప్రకటించడం,.. గాంగేయుడు ఉన్నంత వరకు తాను యుద్ధభూమికి రానని కర్ణుడు వెళ్ళడం ఇవన్నీ సన్నివేశాలుగా కదులుతాయి.
వీరాభిమన్యుని మరణం సంభవిస్తుంది. మాయోపాయాలతో భీష్మ,.. ద్రోణులను పాండవులు వధించడం.. తదుపరి కర్ణుడు కుంతికి ఇచ్చిన మాటకై అర్జునుని తక్క మిగిలిన పాండవులను యుద్ధంలో అవకాశం లభించినా,.. చంపకుండా వదలివేస్తారు. అప్పటికే ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి కర్ణుని సహజకవచకుండలాలను దానంగా గ్రహించి ఉంటాడు. ప్రతిగా ఇచ్చిన శక్తిని ఘటోత్కచ వధకు వినియోగిస్తాడు కర్ణుడు. చివరకు కర్ణుడు యుద్ధభూమిలో పార్థుని శరపరంపరకు బలిఅవుతాడు. తన హితుడు కన్నుమూయగానే వైరాగ్యంతో సుయోధనుడు వాయుబంధంతో ఓ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనిని యుద్ధానికి పిలుస్తారు పాండవులు. తన సైజోదు భీముడేనని అతనితో తలపడతాడు సుయోధనుడు. అతని ఊరువులపై గదతో మోదగానే దుర్యోధనుడు నేల కూలుతాడు. స్వర్గంలో ఉన్న తన మిత్రుడు కర్ణుని కడకు సుయోధనుడు పోవడంతో కథ ముగుస్తుంది.
పైన పేర్కొన్న ప్రధానాంశాలే కాదు,... ఉపాంశాలను సైతం ఉటంకిస్తూ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారు తారక రామారావు. ఇందులో ద్రౌపదిగా శారద,.. కుంతిగా యస్.వరలక్ష్మి,.. భానుమతిగా ప్రభ, ..సుభద్రగా కాంచన,... సత్యభామగా రాజశ్రీ,.. ఉత్తరగా దీప,.. అభిమన్యునిగా బాలకృష్ణ,.. అర్జునునిగా హరికృష్ణ,.. భీమునిగా సత్యనారాయణ,.. ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి,.. దుశ్శాసనునిగా జగ్గారావు,.. భీష్మునిగా మిక్కిలినేని,.. శకునిగా ధూళిపాల,... శల్యునిగా ముక్కామల,.. ద్రోణునిగా రాజనాల,.. విదురునిగా పి.జె.శర్మ అభినయించారు.
కాగా సుతుడు,..ఇంద్రుడు,...జరాసంధుడు,..ద్రుష్టద్యుమ్నుడు..విప్రుడుగా ఐదు పాత్రల్లో చలపతిరావు కనిపించారు. సూర్యునిగా.. ఏకలవ్యునిగా జయభాస్కర్ నటించారు. హలం,.. జయమాలిని నృత్యతారలుగా తళుక్కుమన్నారు. అయితే ఈ చిత్రంలో అతడొక్కడే ఐదు పాత్రలు చేసినట్టు ఆడియెన్ అయితే గుర్తించలేరు. ఇది చాలా గమ్మత్తయిన వ్యవహారం. అప్పటికి ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన ఆరాధకుడిగా పరిశ్రమలో కొనసాగుతున్న చలపతిరావుతో ఐదు పాత్రలు చేయించేశారు ఎన్టీవోడు.
1977లో దానవీరశూర కర్ణ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది. 45 సంవత్సరాలలో ఈ మొత్తాన్ని సవరిస్తే.. ఇప్పటి లెక్కలకు దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేస్తుందనేది ఒక విశ్లేషణ. ఇక ఇప్పటిలా భారతదేశమంతటా విడుదల చేసే అవకాశం ఉండి ఉంటే, ఈ చిత్రం మరెంత పోగేసేదో కదా! 1963 `లవకుశ` తరువాత తెలుగునాట కోటి రూపాయలు చూసిన చిత్రంగా 'దానవీరశూర కర్ణ' చరిత్రలో నిలచింది. అప్పట్లో ఈ చిత్ర నిర్మాణ వ్యయం పది లక్షల రూపాయలు మాత్రమే! పదింతలు పోగేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ చిత్రం 1994లో మరోమారు కోటి రూపాయలు వసూలు చేయడం మరో చరిత్ర! రెండు పర్యాయాలు ఇలా కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రం మరొకటి కానరాదు. 1960లో యావద్భారతమంతటా విజయఢంకా మోగించిన `మొఘల్-ఏ-ఆజమ్` కోటి రూపాయలు పైగా వసూలు చేసింది. `దానవీరశూర కర్ణ` కేవలం ఆంధ్రప్రదేశ్- కర్ణాటకలోని కొన్ని కేంద్రాలలో కలిపి ఆ మొత్తం సాధించింది. ఇక 2004లో రంగుల్లో రీ ప్రొడ్యూస్ చేసి, కొత్తగా సెన్సార్ చేసి విడుదల చేసినప్పుడు `మొఘల్-ఏ-ఆజమ్` మరోమారు కోటి రూపాయలు చూసింది. అయితే ఏక చిత్రంగా `దానవీరశూర కర్ణ` రెండు సార్లు (పాతిక రీళ్ళ నిడివితోనే భళా అనిపించి) కోటి రూపాయలు సాధించిన ఏకైక చిత్రంగా నిలచింది. ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాదు. భారతదేశంలోనే ఓ చిత్రం ఇంతటి ఘనచరితను సొంతం చేసుకోవడం అనితరసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి గొప్ప చిత్రంలో చలపతిరావు అనే నటుడు ఒక భాగమయ్యారు. అది ఒక చరిత్ర.