Begin typing your search above and press return to search.
చలీ చలీ సాంగ్: స్వర్ణయుగాన్ని కళ్ల ముందుకు తెచ్చిన తలైవి
By: Tupaki Desk | 2 April 2021 11:17 AM GMTకంగన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తలైవి. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. అరవింద స్వామి ఎంజీఆర్ గా నటిస్తున్నారు. అమ్మ జయలలితగా కంగన వేషధారణలకు గొప్ప స్పందన లభిస్తోంది. ఇటీవలే జయలలిత నాటి మేటి క్లాసిక్ లుక్ తో కంగన ఫోటోలు రిలీజవ్వగా అభిమానుల్లో వైరల్ అయ్యాయి. ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది.
తాజాగా తలైవి నుంచి చలీ చలీ అంటూ సాగే పాటను లాంచ్ చేస్తున్నారు. చలీ చలీ 8 సెకన్ల ప్రోమో రిలీజైంది. ఇందులో యుక్తవయసులో కథానాయికగా ఆడిపాడిన జయలలిత రూపాన్ని ఆవిష్కరించారు. అభినవ జయలలితకు మరు రూపంగా కంగన అలరిస్తోంది. చలీ చలీ పాట 'జయలలిత స్వర్ణ యుగాన్ని' ఎలివేట్ చేస్తోంది. ఈ పాటను సైంధవి ప్రకాష్ పాడారు. ఇర్షాద్ కమిల్ సాహిత్యం అందించారు. ఈ పాట ద్వారా భారతీయ సినిమాలో జయలలిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తున్నారు. జయలలిత తొలి చిత్రం నుండి ప్రారంభమై అనేక దశల్లో రకరకాల రూపాలకు మారే క్రమంలో ఎలా ఉండేవారో ఈ పాటలో చూడొచ్చు. క్లాసిక్ డేస్ లో తెరపై వెలిగిపోతున్న రోజుల్లో ఆమె చాలా అందంగా కనిపించారు. ఆ రూపంలో కంగన అలరిస్తున్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి .. మేటి కథానాయిక జె. జయలలిత జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. జయలలిత తన సుదీర్ఘ కెరీర్ లో తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం- హిందీ సహా పలు భాషల్లో 120 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె 1961 లో వచ్చిన ఎపిస్టిల్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించారు.. 1965 లో వెన్నిరా ఆదై చిత్రంతో ఆమె కోలీవుడ్ లో అడుగుపెట్టారు.
తలైవి ట్రైలర్ కంగన 34వ పుట్టినరోజున విడుదలైంది. దీనిని ప్రేక్షకులు .. సినీ పరిశ్రమ ప్రజలు ప్రశంసించారు. జయలలిత తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్రశ్రేణి కథానాయికగా ఏలాక రాజకీయ ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎలా మారారో ట్రైలర్ చూపించింది. ఈ ట్రైలర్ లో అరవింద్ స్వామి.. జయలలితకు మెంటార్ ఫిగర్ ఎంజిఆర్ పాత్రలో నటించారు. తలైవికి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్క్రిప్ట్ ను బాహుబలి రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ రాశారు.