Begin typing your search above and press return to search.

50 రోజులు ఛలో అనేసింది

By:  Tupaki Desk   |   22 March 2018 8:00 AM GMT
50 రోజులు ఛలో అనేసింది
X
చిన్న సినిమాగా విడుదలై పెద్ద స్టార్ హీరోతో తలపడాల్సి వచ్చినా భయపడకుండా నిలిచి ఘన విజయం సాధించిన ఛలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక సినిమా మూడు వారాలు ఆడటమే గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఛలో ఈ రేంజ్ కు చేరుకోవడం విశేషమే.24 కోట్లకు పైగా గ్రాస్ తో 12.5 కోట్ల దాకా షేర్ రాబట్టిన ఛలో థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్లకే జరిగింది. విడుదలయ్యాక పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. చాలా రీజనబుల్ రేట్లకు సినిమాను కొన్న వాళ్ళకు మొదటి వారం పూర్తి కాకుండానే మొత్తం పెట్టుబడి వెనక్కు ఇవ్వడంతో పాటు రెండో వారం నుంచే లాభాలు పంచిన ఛలో కొత్త ఏడాదిలో వచ్చిన అతి తక్కువ హిట్స్ లో ప్లేస్ సాధించుకుంది. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో ఛలో రన్ లో ఉండటం గమనించాల్సిన అంశం.

డెబ్యు డైరెక్టర్ వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ - ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా చేసిన అతని టేకింగ్ వెరసి సినిమాను సూపర్ హిట్ చేసాయి. దీన్ని కన్నా ముందు హీరోగా కుదురుకోవడానికి బాగా స్ట్రగుల్ అవుతున్న నాగ శౌర్యకు ఇది మేజర్ బ్రేక్ గా నిలిచింది. ఛలో తర్వాత ఇతను చేయబోయే సినిమాల మీద ట్రేడ్ లో ఆసక్తి మొదలు కావడం దీనికి నిదర్శనం. హీరొయిన్ గా పరిచయమైన రష్మిక మండన్న దీని ద్వారానే నాగ్ నానిల మల్టీ స్టారర్ లో ఛాన్స్ కొట్టేసింది. ఐరా బ్యానర్ పై నాగ శౌర్య ఫ్యామిలీ స్వయంగా నిర్మించిన ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్సుతోనే కొత్త సినిమా @నర్తనశాల ఈ మధ్యే మొదలు పెట్టారు.

50 రోజులు దాటుతున్నా సందడి కంటిన్యూ చేస్తున్న ఛలో రన్ పట్ల దర్శక నిర్మాతలే కాక ట్రేడ్ కూడా సంతోషంగా ఉంది. దీని దర్శకుడు వెంకీ కుడుముల కోసం పెద్ద బ్యానర్లే అవకాశం ఇవ్వడానికి సిద్ధ పడటం గమనార్హం. ఛలోకు సీక్వెల్ ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. ఆ ఆలోచన కూడా చేస్తే బెటరేమో.