Begin typing your search above and press return to search.
నాగ శౌర్య ఛలో.. ఎక్కడికి?
By: Tupaki Desk | 28 Oct 2017 1:39 PM GMTహీరోల అదృష్టం ఒక్కోసారి చాలా వెరైటీగా ఉంటోంది. ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుందో తెలియదు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పుతుందో తెలియదు. ఇప్పుడు అదే తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ఒక కుర్ర హీరో. చందమామ కథలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి హిట్టు కొట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మనోడు హీరోగా సెట్ అయినట్టే అని అందరు అనుకున్నారు.
కానీ ఆ తర్వాత చేసిన కథలన్నీ అడ్డం తిరగడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఛలో అనే ఒక డిఫరెంట్ కథలో నాగ శౌర్య నటిస్తున్నాడు. రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఫ్రీ-లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. పోస్టర్ ని చూస్తుంటే చాలా కొత్తగా ఉన్నట్టే అనిపిస్తోంది. గ్రామంలోకి ఓ సిటీ కుర్రోడు ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ ఊరి ఆరంభంలో ఉన్న ఎంట్రీ రోడ్డులో రెండు దారులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా తమిళ్ తెలుగులో తిరుప్పురం 1930 అని ఒక కట్టడం ఉంది.
రోడ్డు మధ్యలో ఒక కంచె ఉన్నట్లు ఉంది. అంటే అక్కడ తెలుగు - తమిళ ప్రజలు ఉంటారేమో అనే అనుమానం కలిగిస్తోంది. మరి ఈ కుర్రోడు ఏ కంచెలోకి వెళతాడో అనేది పక్కన పెడితే కాన్సెప్ట్ స్క్రిన్ ప్లే ను ఆధారం చేసుకుందని చెప్పవచ్చు. ఇక రేపు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారట. మరి ఈ సినిమా నాగ శౌర్య కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఉషా మూల్పూరి నిర్మిస్తోన్న ఈ సినిమా కు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు.