Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ః ఛలో.. విభజన లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   18 Nov 2017 2:15 PM GMT
టీజర్ టాక్ః ఛలో.. విభజన లవ్ స్టోరీ
X
ఆంధ్ర మరియు తమిళనాడు బౌండరీలో ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం నుండి మధ్యస్తంగా కంచె కూడా వేశారు. అటువైపు తమిళోళ్ళు. ఇటు తెలుగోళ్ళు. ఈ గొడవల్లో ఒక లవ్ స్టోరి. ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు ఇదే థీమ్ తో వస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. కొత్త దర్వకుడు వెంకీ డైరక్షన్ లో చేసిన ''ఛలో'' సినిమా టీజర్ చూస్తే.. ఈసారి ఈ యంగ్ హీరో కాస్త గట్టిగా కొడతాడనే అనిపిస్తోంది.

ఈ సినిమా మేకింగ్ అండ్ విజువల్స్ రెండూ కూడా బాగున్నాయి. ఒక ప్రక్కన క్లాస్ గా కనిపిస్తూనే మరో ప్రక్కన మనోడు మాస్ కూడా ప్రయత్నించాడు. గొడవలంటే నాక్కూడా ఇష్టమేరా.. కాని ఇలా ఇడ్లీ సాంబార్ కోసం కొట్టేసుకోవడం ఏంటి అంటూ తమిళ తంబీలపై గట్టి పంచులే పేల్చాడు. మొత్తానికి ఈ విభజన నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. ఒక్క ఫ్రేములోనే కనిపించినా కూడా రష్మికా మందన్నా కూడా ఇంప్రెస్ చేసింది.

ఇకపోతే కొత్త ప్రొడ్యూసర్ల ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే.. సినిమాను బాగా తీర్చిదిద్దారని అనుకోవచ్చు. మణిశర్మ కొడుకు మహతి అందించిన మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా నాగ శౌర్య ఈసారి చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. చూడాలి బాక్సాఫీస్ దగ్గర ఏమవుతుందో.