Begin typing your search above and press return to search.

అర మిలియన్ లాగేసిన ఛలో

By:  Tupaki Desk   |   5 Feb 2018 6:52 AM GMT
అర మిలియన్ లాగేసిన ఛలో
X
ఫిబ్రవరి 2 విడుదలకు ముందు రోజు కూడా రవితేజ టచ్ చేసి చూడుతో నాగ శౌర్య ఛలోతో పోటీకి దిగి తొందపడుతున్నాడేమో అన్న అనుమానమే అందరికి కలిగింది. కాని చివరికి ఛలో యూనిట్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. రెండు సరిహద్దు గ్రామాల మధ్య పగ ప్రతీకారాల కథను తీసుకుని దర్శకుడు వెంకీ కుడుముల కామెడీగా మలిచిన తీరు దానికి హీరో లవ్ స్టొరీ లింకప్ చేసిన స్క్రీన్ ప్లే కి మౌత్ పబ్లిసిటి తోడై ఛలో దూసుకుపోతోంది. మొదటి మూడు రోజులు బాగానే లాగేసుకున్న నాగ శౌర్య ఓవర్సీస్ లో మాత్రం షాకింగ్ ఫిగర్స్ నమోదు చేస్తున్నాడు. మొదటి మూడు రోజుల్లోనే అర మిలయన్ మార్క్ కు అతి దగ్గరకు వెళ్ళిపోయిన ఛలో మరో ఐదు రోజులు పోటీ లేకుండా సోలోగా ఉంటుంది కాబట్టి కొత్తః రికార్డు సెట్ చేసినా ఆశ్చర్యం లేదు.

మొదటి రోజు ప్రీమియర్ షోల ద్వారా 94 వేల డాలర్ల దాకా లాగిన ఛలో నిన్న ఆదివారం ముగిసేసరికి 4 లక్షల 98 వేల డాలర్లతో ఈ రోజు ఆ లాంఛనం పూర్తి చేసేస్తుంది. మరోవైపు అదే రోజు విడుదలైన టచ్ చేసి చూడు మూడు రోజులకు గాను కేవలం 1 లక్ష 92 వేల డాలర్ల దగ్గరే ఆగిపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. మాస్ మహారాజా మేజిక్ ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఏ మాత్రం పనిచేయలేదు. మరోవైపు భాగమతి విజయవంతంగా 1 మిలియన్ మార్క్ దాటేసి ఇంకా స్టడీగానే ఉంది. మరి కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్పుకోదగ్గ మొత్తమే రాబట్టవచ్చు.

పద్మావత్ లాంటి విజువల్ గ్రాండియర్ తో పోటీ ఉన్నప్పటికీ తెలుగు సినిమాలు ఇంత బాగా వసూలు చేయటం విశేషమే. ప్యాడ్ మ్యాన్, అయారి తో పాటు మూడు తెలుగు సినిమాలు ఈ వారం విడుదల అవుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం అయితే శుక్రవారం నుంచి ఛలో - భాగమతి మీద తప్పకుండా పడుతుంది. అప్పటి దాకా మౌత్ పబ్లిసిటీతో దూసుకెళ్తున్న ఛలో ఎక్కడ ఆగుతుందో చెప్పలేం కాని నాగ శౌర్య కెరీర్ లో హయ్యెస్ట్ ఓవర్సీస్ మార్క్ ని మాత్రం రీచ్ అయిపోయింది కనక కుర్రాడి టెన్షన్ సగం తీరినట్టే.