Begin typing your search above and press return to search.

ఆ 50 మందికి ఎడిటింగ్ రూమ్‌ లో కీర్తి సురేష్‌ మూవీ చూసే ఛాన్స్‌

By:  Tupaki Desk   |   27 Jun 2021 8:30 AM
ఆ 50 మందికి ఎడిటింగ్ రూమ్‌ లో కీర్తి సురేష్‌ మూవీ చూసే ఛాన్స్‌
X
మహానటి తర్వాత కీర్తి సురేష్‌ కు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు పెరిగి పోయారు. ముఖ్యంగా సౌత్‌ లో ఈమె స్టార్‌ డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాల సంఖ్య పెద్దగానే ఉంది. ఇప్పటికే ఈమె అభిమానులు గుడ్‌ లక్‌ సఖి సినిమా విడుదల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఫిల్మ్‌ మేకర్స్ ను గుడ్‌ లక్‌ సఖి సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి వారి కోసం నిర్మాతలు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది.

కీర్తి సురేష్‌ ను అమితంగా అభిమానిస్తూ పదే పదే సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్ ను అడిగిన 50 మందికి ప్రత్యేకంగా ఎడిటింగ్‌ రూమ్‌ లో గుడ్‌ లక్‌ సఖి సినిమాను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ 50 మంది సినిమా విడుదలకు ఇంకా కొన్ని వారాలు ఉండగానే చూడబోతున్నారు. వారు ఎవరు అనే విషయం అతి త్వరలోనే వెళ్లడిస్తామని మేకర్స్‌ చెబుతున్నారు.

కీర్తి సురేష్‌ ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరియు జగపతిబాబులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఓటీటీ ద్వారా ఈ సినిమాను నేరుగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని నిర్మాత ఆ వార్తలను ఖండించి సినిమాను మొదట థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.