Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్ ని నమ్మి పదే పదే ఛాన్స్
By: Tupaki Desk | 16 Aug 2021 3:30 PM GMTయువహీరో రాజ్ తరుణ్ కెరీర్ ఇటీవల కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రిలీజైన ఒరేయ్ బుజ్జిగా యావరేజ్ గా ఆడింది. అంతకుముందు కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. అయినా ఇప్పుడు కూడా మరోసారి రాజ్ తరుణ్ ని నమ్మి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్త మరో అవకాశం ఇస్తోంది.
ఉయ్యాల జంపాల లాంటి చిత్రంతో డెబ్యూ హీరోగా రాజ్ తరుణ్ ని పరిచయం చేసిన ఘనత అన్నపూర్ణ బ్యానర్ కే చెందుతుంది. ఆ తర్వాత కూడా `రంగుల రాట్నం` అనే చిత్రంలో నటించేందుకు రాజ్ తరుణ్ కి అన్న పూర్ణ బ్యానర్ అవకాశం కల్పించింది. కానీ ఆ సినిమా ఫలితం డిజాస్టరైంది. అయినా ఇప్పుడు అతడికి మూడో ఛాన్స్ లభించింది. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేం శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ బేనర్ ఈ చిత్రానికి `అనుభవించు రాజా` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసింది. రాజ్ సరసన కాషిష్ ఖాన్ అనే కొత్తమ్మాయి నటిస్తోంది. సైలెంట్ గా ప్రారంభించి చకచకా పూర్తి చేశారని త్వరలోనే రిలీజ్ కి కూడా వచ్చేస్తుందని గుసగుస వినిపిస్తోంది.
ఇక రాజ్ తరుణ్ కి ఫ్లాపులున్నా నాగార్జున.. దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు. ఈసారి అతడికి హిట్టు చాలా కీలకమైన దశలో నాగ్ మరోసారి ఆదుకుంటున్నారు. రాజ్ తరుణ్ కి లక్ కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.