Begin typing your search above and press return to search.
ఎన్టీఆరూ.. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం
By: Tupaki Desk | 25 Aug 2016 11:37 AM GMTఎన్టీఆర్ మంచి నటుడు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలోనే తనేంటో చూపించాడు. తాజాగా టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలతో అందరి నుంచి అభినందనలు అందుకున్నాడు. ఐతే ఇన్నాళ్లు ఎన్టీఆర్ చేసిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో చేయబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో మోహన్ లాల్ ఉన్నాడు.
మోహన్ లాల్ ‘కంప్లీట్ యాక్టర్’ అని దేశమంతా ఒప్పుకుంది. ఆ మాటే ఆయనకు బిరుదుగా మారిపోయింది. తెలుగులో ఏ నటుడూ నచ్చడనే సురేష్ బాబు సైతం తనకు మోహన్ లాల్ అంటే మాత్రం చచ్చేంత ఇష్టం అంటారు. అదీ మోహన్ లాల్ స్థాయి. తెరమీద మోహన్ లాల్ ఉంటే.. మిగతా నటులందరూ పక్కకు వెళ్లిపోవాల్సిందే. తన నటనతో అంతగా హైలైట్ అవుతాడు మోహన్ లాల్. మరి అలాంటి నటుడి ముందు ఎన్టీఆర్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు. ఆయనకు ఎలాంటి పోటీ ఇస్తాడు.. నటనలో ఆయన ముందు తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడు అన్నది ఆసక్తికరం.
గతంలో మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడితో కలిసి ‘యమదొంగ’లో తెరను పంచుకున్న ఎన్టీఆర్.. ఆయనకు దీటుగా నటించాడు. యమలోకపు సన్నివేశాల్లో అదరగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మోహన్ లాల్ ను ఢీకొట్టబోతున్నాడు తారక్. సినిమాలో లాల్ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. దానికి చాలానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. మరి అలాంటి బలమైన పాత్రలో మోహన్ లాల్ ఎలా నటించి ఉంటాడో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడంటే.. నటనలో అతడికి తిరుగులేదని అందరూ అంగీకరిస్తారు.