Begin typing your search above and press return to search.
హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్న స్టార్ సింగర్
By: Tupaki Desk | 14 March 2020 4:29 AM GMTఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ కరోనా వైరస్ ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అన్ని రంగాలు విలవిలలాడిపోతున్నాయి. సినిమా రంగంపై చాలా ప్రభావం కనిపిస్తుంది. కరోనా దెబ్బతో ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.. విడుదల వాయిదా పడ్డాయి. ఇక పర్యాటక రంగం అయితే పూర్తిగా దెబ్బ తిన్నట్లుగా దాదాపు అన్ని దేశాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమయంలో కన్నడ స్టార్ సింగర్ చందన్ శెట్టి హనీమూన్ కు అంటూ ఇటలీ వెళ్లి అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వెంటనే తిరుగుముఖం పట్టాడు. హనీమూన్ సంగతి తర్వాత ముందు బతికి ఉండాలి కదా అంటూ అక్కడ నుండి భార్యతో కలిసి వచ్చేసినట్లుగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఇటలీ అనుభవాలను షేర్ చేసుకున్నాడు.
పెళ్లి అయిన వెంటనే ఇద్దరికి ఇష్టం అయిన ఇటలీ కి హనీమూన్ కు వెళ్లాం. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అడుగు బయట పెట్టాలంటే కష్టం అయ్యింది. దాంతో ఎంత సేపటికి హోటల్ కే పరిమితం అయ్యాం. అందుకే ఇక ఇక్కడుండి వృదా అంటూ విరహ వేదనతో ఇండియా తిరిగి వచ్చినట్లుగా ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. కన్నడ మీడియా లో చందన్ శెట్టి హనీమూన్ రిటర్న్ వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. పాపం కొత్త జంటకు కూడా కరోనా భయం తప్పలేదు.