Begin typing your search above and press return to search.
తెలుగమ్మాయి టాలెంట్ గుర్తిస్తారా?
By: Tupaki Desk | 14 Aug 2018 4:02 AM GMTసినీ రంగంలో నటీనటులకు అందం.. అభినయం రెండూ ఉన్నంత మాత్రాన విజయవంతం అవుతారని గ్యారెంటీ ఏమీ లేదు. దానికి కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. అవకాశాలు అందుకుంటే సరిపోదు. వచ్చిన అవకాశాలు మంచివై ఉండాలి. చేసే సినిమాలు విజయవంతం కావాలి. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి విషయంలో ఇలా జరగలేదు. ఆమెలో అందం ఉంది. నటన విషయంలోనూ ఢోకా లేదు. ‘మధురం’ సహా ఆమె నటించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తే తన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఐతే సినిమాల్లో అవకాశాలైతే అందుకుంది కానీ.. అవేవీ ఆమెకు కలిసి రాలేదు.
‘కుందనపు బొమ్మ’.. ‘బ్రహ్మోత్సవం’.. ‘హౌరా బ్రిడ్జ్’ లాంటి సినిమాల్లో నటించిన చాందినికి ఆ సినిమాలు చేదు అనుభవాలే మిగిల్చాయి. ఐతే తాను కథానాయికగా నటించిన కొత్త సినిమా ‘మను’ తన రాత మారుస్తుందని చాందిని ఆశిస్తోంది. ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిలిం ‘మధురం’ తీసిన ఫణీంద్ర నరిశెట్టినే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. దీని ప్రోమోలు చాలా కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇందులో చాందిని పాత్రకు మంచి ప్రాధాన్యం ఉన్నట్లే ఉంది. ఆమె లుక్.. నటన కొత్తగా అనిపిస్తున్నాయి. సెప్టెంబరు 7న రానున్న ఈ చిత్రమైనా చాందిని లక్ మారుస్తుందేమో చూడాలి.