Begin typing your search above and press return to search.
వైజాగ్ బ్యూటీ వయ్యారం మంటలు రేపుతుందే!
By: Tupaki Desk | 28 Aug 2021 12:30 PMవైజాగ్ బ్యూటీ చాందిని చౌదరి యూట్యూబ్ లో పాపులరై లఘు చిత్రాల నాయికగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా ప్రమోట్ అయింది. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` చిత్రంతో వెండి తెరకు పరిచయమైన చాందిని అటుపై `ప్రేమ ఇష్క్ కాదల్`..`బ్రహ్మోత్సవం`..`శమంతకమణి`..`లై` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత `హౌరా బ్రిడ్జ్` చిత్రంతో హీరోయిన్ గా ప్రమోట్ అయింది. బ్రిడ్జి నేపథ్యంలో సాగిన ప్రేమ కథను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. హీరోయిన్ గా చాందినికి మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత `మను` అనే సినిమా చేసిందిగానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
ఆ తర్వాత కరోనా ఎంట్రీతో అమ్మడు నటించిన `కలర్ ఫోటో`..`భూంబాట్` చిత్రాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. కలర్ ఫోటో గొప్ప ఆదరణ దక్కించుకుంది. చాందిని ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన `సూపర్ ఓవర్` ఆహాలో రిలీజ్ అయింది. ఇలా తెలుగు అమ్మాయి కెరీర్ గ్యాప్ లెస్ గానే సాగిపోతోంది. అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్ ప్రెండ్ పాత్రలకే పరిమితమైనా మెయిన్ స్ట్రీమ్ నాయికగా ఎదిగేందుకు తపిస్తోంది.
ఇంతకుముందు బిగ్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్సయ్యింది. ఒక నిర్మాత కాంట్రాక్ట్ పేరుతో తన బల్క్ డేట్లు లాక్ చేయడంతో క్రేజీ ఆఫర్లు వదులుకోవాల్సొచ్చిందని చాందిని వాపోయింది. బేసిక్ గానే చాందిని చౌదరి తెలుగు అమ్మాయి కావడంతో ఆరంభంలో కాస్త సిగ్గు.. బిడియం లాంటివి ఎక్కువగానే కనిపించాయి. కాలక్రమంలో పోటీకి తగ్గట్టు అమ్మడు తనని తాను పూర్తిగా మార్చుకుంది.
ఇటీవల సోషల్ మీడియాల వెల్లువలో గ్లామర్ డాళ్ గా ఫోకస్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రయివేట్ ఫోటో షూట్లలో హాట్ ఫోటోలతో రచ్చ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆ స్పీడ్ మరింత గా కనిపిస్తోంది. తాజాగా చాందిని థై-థండర్ అందాల్ని ఫోకస్ చేస్తూ కొత్త ఫోటో షూట్ వైరల్ గా మారింది. పొట్టి నిక్కర్ లో కుర్చీపై కుర్చుని రెండు చేతులు బిగించింది. నియాన్ కాంతికి తగ్గట్టే నియాన్ మెరుపుల కాంబినేషన్ డ్రెస్ కు మ్యాచింగ్ గా ఆ కాళ్లకు లైట్ గ్రీన్ హై హీల్స్ ధరించింది. ఆ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి వైరల్ చేస్తోంది. చాందిని ప్రయత్నాలు ఇకనైనా ఫలిస్తాయనే ఆశిద్దాం.
తెలుగమ్మాయిల వెల్లువలో సక్సెసవుతున్న కథానాయికలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంతకుముందు కేవలం పెద్ద తెర లేదా బుల్లితెర ఆఫర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటికి అదనంగా డిజిటల్ అపారమైన అవకాశాలిస్తోంది. ఓటీటీ సిరీస్ లలోనూ భారీగా అవకాశాలొస్తున్నాయి. ఇప్పుడు చాందిని లాంటి ట్యాలెంటెడ్ నాయికలు దూసుకుపోయేందుకు ఆస్కారం ఉంది. ఇటీవల ఆహా లో చాందిని మంచి అవకాశాలు అందుకుంటోంది. తనని తాను నిరూపించుకుంటోంది. తనను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు నవతరం నాయికలు డిజిటల్ లో అవకాశాల కోసం యత్నిస్తున్నారని సమాచారం.