Begin typing your search above and press return to search.

చైతూ-సమంతల సంగతి చందూకు తెలియదట

By:  Tupaki Desk   |   15 Oct 2016 1:30 PM GMT
చైతూ-సమంతల సంగతి చందూకు తెలియదట
X
నాగచైతన్య-సమంతల మధ్య ఏడెనిమిదేళ్లుగా పరిచయముంది. ఐతే వాళ్లిద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారన్న సంగతి మాత్రం ఇండస్ట్రీ జనాలకు కూడా చాలామందికి తెలియదు. కొన్నేళ్ల ముందు నుంచే లవ్‌ లో ఉన్నా అది బయటకుండా మెయింటైన్ చేయడంలో ఇద్దరూ బాగానే సక్సెస్ అయ్యారు. మామూలుగా హీరో హీరోయిన్లు ఎవరైనా కొంచెం క్లోజ్‌ గా మూవ్ అయ్యారంటే చాలు.. మీడియాలో వార్తలు మొదలైపోతాయి. ఇండస్ట్రీ జనాలే దీనికి సంబంధించి లీకులిస్తుంటారు. కానీ చైతూ-సమంత గురించి మాత్రం ఈ ఏడాది మే వరకు ఎలాంటి రూమర్ వినిపించలేదు. సమంత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమాయణం గురించి హింట్ ఇచ్చే వరకు విషయమే బయటికి పొక్కలేదు.

విశేషం ఏంటంటే.. నాగచైతన్యతో గత ఏడాది నుంచి ట్రావెల్ చేస్తున్న యువ దర్శకుడు చందూ మొండేటికి సైతం వీళ్ల ప్రేమాయణం గురించి తెలియదట. ‘ప్రేమమ్’ సినిమా రీమేక్ చేద్దామనుకున్నపుడు అతడికి వీళ్ల లవ్ స్టోరీ గురించి సమాచారం లేదట. ఈ సినిమాలో మూడో లవ్ స్టోరీ కోసం ముందు సమంతనే తీసుకుందామనుకున్నట్లు.. తర్వాత యూనిట్ సభ్యుల అభిప్రాయం మేరకు మలయాళంలో చేసిన మడోన్నా సెబాస్టియన్‌ నే ఎంచుకున్నట్లు చందూ ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే అప్పటికి చైతూ-సమంత ప్రేమలో ఉన్న సంగతి తనకు తెలియదని.. ఈ విషయం తెలిసి ఉంటే మాత్రం కచ్చితంగా సమంతనే మూడో పాత్రకు తీసుకుని.. తనతోనే సమంతకు పెళ్లి జరిగినట్లు చూపించేవాడినని.. అలా చేస్తే సినిమాకు మరింత మేలు జరిగేదని అన్నాడు చందూ. దీన్ని బట్టే చైతూ ఎంత రిజర్వ్డ్ పర్సనో.. ఎంతటి ఇంట్రావర్టో అర్థమైపోతోంది కదా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/