Begin typing your search above and press return to search.
సవ్యసాచి సిండ్రోమ్ అసలు కథ ఇదీ
By: Tupaki Desk | 29 Oct 2018 10:24 AM GMTఅక్కినేని నాగచైతన్య నటిస్తున్న `సవ్యసాచి` ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ సినిమా కథ పరంగా దర్శకుడు చందు మొండేటి తనదైన శైలిలో కొత్తగా వెళుతున్నాడు. అతడు ఎంపిక చేసుకున్న కథ - చైతూ పాత్ర తీరుతెన్నులు.. చేస్తున్న ప్రయత్నం ఎంతో డిఫరెంట్ అన్న టాక్ వినిపించింది. ఇదివరకూ రిలీజైన సవ్యసాచి ట్రైలర్ లో చైతూ ఎడమచేతి సిండ్రోమ్ పై కొంత క్లారిటీ వచ్చింది. ఎడమ చెయ్యి తన మాట వినదు.. దానికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
అసలింతకీ ఆ సమస్య ఏంటి? అని దర్శకుడు చందు మొండేటినే ప్రశ్నిస్తే ఏం చెప్పాడో తెలుసా? ఆ సిండ్రోమ్ పేరు వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్. ఇది ఇప్పటిది కాదు. ఈ సిండ్రోమ్ కి పెద్ద చరిత్రే ఉంది. దీనిపై అంతర్జాలంలో బోలెడంత సమాచారం ఉంది. ఇదో తరహా ప్రాబ్లెమ్.. ఓ చెయ్యి ప్రవర్తన అదుపులో ఉండదు.. ఈ కథ విన్న తర్వాత నాగచైతన్య - నాగార్జున గారితో పాటు.. మైత్రి అధినేతలు నెట్ లో బోలెడంత సమాచారం వెతికి మరీ తెలుసుకున్నారు. అలా మేం ఈ ప్రయత్నం చేయగలిగాం.
మాధవన్ గారికి కథ వినిపించగానే - ఇందులో చాలా విషయం ఉంది. తీసి పారేసే కథ కానేకాదని ప్రోత్సహించారని, ఆయన ఓకే చెప్పాక ఈ కథపై తనకు మరింత నమ్మకం పెరిగిందని చందు మొండేటి తెలిపారు. మణిరత్నం వంటి గొప్ప దర్శకుడి వద్ద పని చేసిన గ్రేట్ యాక్టర్ మ్యాడీ. ఎంతో సెలక్టివ్ గానే కథల్ని ఎంచుకుంటారు. ఆయన ఓకే చెప్పాక నా నమ్మకం రెట్టింపైందని అన్నారు. తనను కథ డ్రైవ్ చేస్తుందని - తొలుత నాగచైతన్యతో సినిమా చేయాలనుకోగానే కొంత కథ రాసుకున్న తర్వాత ఏం ప్రత్యేకత కావాలి? అనుకున్నప్పుడు వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి ఓ ఆర్టికల్ చదివి స్ఫూర్తి పొందానని తెలిపారు. అలా కథలో అదో భాగం అయ్యిందని - అయితే సినిమా అంతా అదే ఉండదని చందు అన్నారు. ఇందులో రెగ్యులర్ సినిమాలో ఉన్నట్టే లవ్ - రొమాన్స్ - వినోదం - యాక్షన్ అన్నీ సమపాళ్లలో రంగరించానని తెలిపారు. తదుపరి ఓ రెండు నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నా. ఈ సినిమా ఫలితంపై ఆధారపడి తదుపరి సినిమాలు ఉంటాయని అన్నారు.