Begin typing your search above and press return to search.

డైన‌మిక్ హీరోని ఈ క్ష‌ణం గ‌ట్టెంకించేదెలా!

By:  Tupaki Desk   |   17 Sep 2019 5:30 PM GMT
డైన‌మిక్ హీరోని ఈ క్ష‌ణం గ‌ట్టెంకించేదెలా!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. నేచుర‌ల్ స్టార్ నాని త‌ర్వాత స్వ‌యంకృషితో కెరీర్ ని మ‌లుచుకుంటున్న హీరోగా నిఖిల్ పై అభిమానుల‌కు ప్ర‌త్యేక గౌర‌వం. ఇమేజ్ స‌మ‌స్య లేని హీరోగా క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేస్తూ త‌న కంటూ ఓ రేంజ్ ఉంద‌ని నిరూపించాడు. మార్కెట్ ని అంత‌కంత‌కు పెంచుకుంటూ ఫోక‌స్సివ్ గా వెళుతున్న టైమ్ లో అత‌డి జీవితంలో ఓ కుదుపు. అర్జున్ సుర‌వ‌రం ర‌క‌ర‌కాల వివాదాల న‌డుమ వాయిదాల ఫ‌ర్వంలోకి వెళ్ల‌డం అత‌డిని తీవ్రంగానే ఇబ్బంది పెట్టింది. అయితే అన్ని కుదుపుల నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డాలంటే ఇప్పుడు అనూహ్యంగా ఏదైనా మిరాక‌ల్ జ‌రగాల్సిందేనా? అంటే.. అవున‌నే అభిమానులు భావిస్తున్నారు.

కార్తికేయ 2 తోనే అత‌డికి పూర్వ వైభ‌వం సాధ్యమవుతుంద‌ని న‌మ్ముతున్నారు. అయితే ఈ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు చందు మొండేటి మీద‌నే ఉంది. కార్తికేయ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన చందు ఈసారి సీక్వెల్ కోసం ఎలాంటి క‌స‌ర‌త్తు చేశార‌న్న‌ది ఉత్కంఠ పెంచుతోంది. అక్టోబ‌ర్ రెండో వారం నుంచి నిఖిల్ - చందు జోడీ సెట్స్ కి వెళుతున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ ఫేం శృతి శ‌ర్మ క‌థానాయిక అంటూ ప్ర‌చారం సాగుతున్నా అధికారికంగా క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఒక ఫ్లాప్ త‌ర్వాత చందుకి ఇదో బిగ్ ఛాలెంజ్.. హీరోని నిల‌బెట్టాలి.. తాను నిల‌బ‌డాలి. అందుకే క‌థ విష‌యంలో ఏమాత్రం రాజీకి రాకుండా అత‌డు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. గ‌తంతో పోలిస్తే క‌థ‌ల్లో మార్పు వ‌చ్చింది. అందుకు త‌గ్గ‌ట్టే స్క్రీన్ ప్లే ప‌రంగానూ సంథింగ్ లేనిదే స‌క్సెస్ అన్న‌ది క‌ష్టంగా మారింది. ఆ దిశ‌గా చందు చాలానే క‌స‌ర‌త్తు చేశార‌ట‌. ఈ ఛాలెంజ్ లో యంగ్ ట్యాలెంట్ ఎలా నెగ్గుకు రాబోతున్నారు అన్న‌ది చూడాల్సి ఉంది. అగ్ర నిర్మాత‌ల అల‌యెన్స్ తో సినిమాలు నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టి.జి.విశ్వప్రసాద్- వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు- సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.