Begin typing your search above and press return to search.
చందూలో ఈ యాంగిల్ కూడా ఉందా?
By: Tupaki Desk | 7 Oct 2016 8:24 AM GMTఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా `ప్రేమమ్`తో రెండు రకాల గుర్తింపును సొంతం చేసుకొన్నాడు దర్శకుడు చందు మొండేటి. నాగచైతన్య కోసం మొదట ఎలాంటి కథని అనుకొన్నాడో ఏంటో కానీ... ఊహించని రీతిలో ప్రేమమ్ రీమేక్ చేసే బాధ్యతని ఆయనపై పెట్టింది అన్నపూర్ణ కాంపౌండ్. కొత్త దర్శకుడు కదా - ఆయన అనుకొన్నది తీసుంటేనే బాగుండేది అని మాట్లాడుకొన్నారంతా. పైగా `ప్రేమమ్`లాంటి క్లాసిక్ సినిమాని రీమేక్ చేసే బాధ్యతని చందుపై పెట్టడం ముమ్మాటికీ తప్పే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ చందు సక్సెస్ ఫుల్ గా సినిమా తీసినా దర్శకుడిగా ఆయనకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్నవాళ్లూ ఉన్నారు. కానీ చందూ మొండేటి మాత్రం ఆ అభిప్రాయాలన్నింటినీ తప్పు చేసేలా `ప్రేమమ్` తెరకెక్కించాడు.
ఈ సినిమాతో తాను ప్రేమకథల్నీ చక్కగా తీయగలనని నిరూపించడంతో పాటు - మాస్ నీ అలరించగలననే ఓ సంకేతాన్ని పరిశ్రమకి పంపించాడు. `ప్రేమమ్`లో చందు మాస్ ఎలిమెంట్స్ ని జోడించిన విధానం చాలా బాగుంది. థియేటర్లలో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలకైతే అంతే లేదు. చందు మొండేటిని ఆకాశినికెత్తేస్తున్నారు. ప్రేమమ్ పక్కా ఓ ప్రేమకథ అయినప్పటికీ చైతూతో సైకిల్ చైన్ పట్టించాడు. లుంగీ కట్టించి - మాస్ స్టైల్ తో వీరోచితమైన ఫైట్లు చేయించాడు. ఇవన్నీ చూసి చందులో మంచి మాస్ డైరెక్టర్ యాంగిల్ కూడా ఉందని మాట్లాడుకొంటున్నారు విశ్లేషకులు. ప్రేమమ్ చూశాక మాస్ కథానాయకులంతా కూడా చందుతో సినిమా చేయడానికి రెడీ అయిపోవడం ఖాయం.