Begin typing your search above and press return to search.
ప్రేమమ్ పై అలా పడతారనుకోలేదు-చందూ
By: Tupaki Desk | 9 Oct 2016 5:55 PM GMTఒక సినిమాను రీమేక్ చేస్తే బాగోదని అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదని.. కానీ దాని గురించి అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నాడు చందూ మొండేటి. తన దర్శకత్వంలో వచ్చిన రీమేక్ మూవీ ‘ప్రేమమ్’ విషయమై అతనిలా స్పందించాడు. ప్రేమమ్ రీమేక్ గురించి.. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రకు శ్రుతి హాసన్ ను తీసుకోవడంపై అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై చందూ మాట్లాడాడు.
‘‘ప్రేమమ్ సినిమాకు నేను పని చేయకపోయి ఉంటే నేను కూడా ఈ రీమేక్ కరెక్ట్ కాదని అని ఉండొచ్చు. ప్రతి విషయం మీదా ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. దాన్ని చెప్పడంలో తప్పులేదు. ఐతే అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా వ్యతిరేకంగా అదే పనిగా ప్రచారం చేయడమే ఆశ్చర్యం కలిగించింది. ఈ ట్రోలింగ్ భయపెట్టలేదు కానీ.. ఎక్కువగా బాధపెట్టింది. ఒక మంచి సినిమాను అందిద్దామనుకుంటే ఇలా చేస్తున్నారేంటి అనిపించింది. ఐతే నెగెటివ్ ప్రచారం సినిమా మీద పడలేదు.
సోషల్ మీడియా వరకే ఈ ట్రోలింగ్ జరిగింది. కానీ మిగతా మీడియా అంతా మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమా గురించి ఎప్పుడూ పాజిటివ్ వార్తలే ఇచ్చింది. ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులోకి తేవడం మంచి ప్రయత్నమని.. ప్రేక్షకులకు మంచి సినిమా అందించినట్లు అవుతుందని ఆర్టికల్స్ వచ్చాయి. ఏదేమైనా చివరికి మంచి ఫలితం వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీ’’ అని చందూ అన్నాడు. తన కెరీర్ మొత్తంలో అనుభవించాల్సిన స్ట్రెస్ ఈ సినిమా ఒక్కదానికే అనుభవించానని.. ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నానని చందూ చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/