Begin typing your search above and press return to search.

రవితేజ సినిమాపై చందూ స్పందించాడు

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:00 AM IST
రవితేజ సినిమాపై చందూ స్పందించాడు
X
తొలి సినిమా ‘కార్తికేయ’తోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యువ దర్శకుడు చందూ మొండేటి. తాజాగా రీమేక్ మూవీ ‘ప్రేమమ్’తోనూ తన ప్రత్యేకత చాటుకున్నాడు చందూ. దీంతో అతడి కోసం చాలామంది హీరోలు.. నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఐతే తన తర్వాతి సినిమాగా ఏది చేయాలో తేల్చుకోలేని సందిగ్ధతలో ఉన్నాడు చందూ. కొత్తగా సినీ నిర్మాణంలోకి వస్తున్న ‘ఐడ్రీమ్స్’ వాసుదేవరెడ్డికి చందూ తన తర్వాతి సినిమా చేసే అవకాశాలున్నాయి. ఆల్రెడీ ఆయనతో సినిమాకు సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తాడని.. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని వార్తలొచ్చాయి.

ఐతే శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చేస్తుండగా వరుణ్ తేజ్ గాయపడటంతో ఆ సినిమా షెడ్యూళ్లు డిస్టర్బ్ అయ్యాయి. ఆ చిత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ఆలస్యం తప్పకపోవచ్చు. దీంతో చందూ కొన్ని నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేసుకోవడానికి తగ్గట్లుగా చందూకు మాస్ రాజా రవితేజ నుంచి పిలుపు వచ్చినట్లుగా కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై చందూ స్వయంగా స్పందించాడు. రవితేజ కోసం స్క్రిప్టు తయారు చేస్తున్న మాట వాస్తవమే అన్నాడు. అన్నీ కుదిరితే తమ కాంబినేషన్లో సినిమా ఉండొచ్చని చెప్పాడు. మరి కథలు నచ్చకో.. ఇంకో కారణంతోనో ఏడాదిగా ఖాళీగా ఉంటున్న రవితేజ.. చందూతో అయినా సినిమా ఓకే చేస్తాడో లేదో చూడాలి.