Begin typing your search above and press return to search.
‘ప్రేమమ్’ కోసం సమంతను కన్సిడర్ చేశారట
By: Tupaki Desk | 10 Oct 2016 11:30 AM GMTమొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘ప్రేమమ్’ సినిమాకు సమంతను హీరోయిన్ గా తీసుకుని ఉండొచ్చు కదా అని నాగచైతన్యను అడిగితే.. అది తన పరిధిలో లేదని.. దర్శక నిర్మాతలే హీరోయిన్లను ఫైనలైజ్ చేశారని అన్నాడు నాగచైతన్య. మరి ఇదే సంగతి దర్శకుడు చందూ మొండేటి దగ్గర ప్రస్తావిస్తే.. సమంతను ఈ సినిమా కోసం కన్సిడర్ చేశామని వెల్లడించాడు.
హీరో మూడో ప్రేమకథలో కథానాయికగా సమంతనే పెడదామనుకున్నాడట చందూ. ఐతే యూనిట్ సభ్యులందరి సలహా మేరకు ‘ప్రేమమ్’ ఒరిజినల్లో నటించిన మడోన్నా సెబాస్టియన్ అయితేనే బాగుంటుందని భావించి.. ఆమెనే ఎంచుకున్నామని చందూ చెప్పాడు. ఈ పాత్రకు మడోన్నా పూర్తి న్యాయం చేసిందని చందూ వెల్లడించాడు. ఐతే సినిమాలో తనకు నచ్చిన ఎపిసోడ్ మాత్రం మధ్యలో వచ్చే శ్రుతి హాసన్ స్టోరీనే అని చందూ తెలిపాడు.
శ్రుతి హాసన్ పాత్రతో తాను బాగా కనెక్టవుతానని.. ఇంజినీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి రావడం వల్ల ఆ లెక్చరర్ పాత్ర తనకు ఇష్టమని చందూ తెలిపాడు. ఈ పాత్రను తీర్చిదిద్దడంలో తన నిజ జీవిత అనుభవాలు కూడా ఉన్నట్లు చందూ తెలిపాడు. తన భార్య కూడా లెక్చరరే అని చందూ వెల్లడించాడు. ఆమె తీరును స్టడీ చేసి.. శ్రుతి పాత్రను తీర్చిదిద్దినట్లు చందూ తెలిపాడు. అప్పుడే చదువు పూర్తి చేసి లెక్చరర్ గా చేరిన వాళ్ల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. ఆ లక్షణాల్ని శ్రుతి పాత్రలో చూపించానని అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/